Homeమెదక్‌Indiramma Houses | సోమక్కపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం

Indiramma Houses | సోమక్కపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం

  • గంగిరెద్దుల గూడెంలో ఇళ్లకు ముగ్గు పోసిన ఎంపీడీవో ప్రవీణ్,ప్రజాప్రతినిధులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పథకంలో భాగంగా సోమక్కపేట గ్రామంలోని గంగిరెద్దుల గూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోశారు.ఎంపీడీవో ప్రవీణ్,గ్రామ సర్పంచ్ బెస్త దుర్గాచలం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని సూచించారు.ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంత గూడు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.గ్రామ సర్పంచ్ బెస్త దుర్గాచలం మాట్లాడుతూ.. గ్రామంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

- Advertisement -

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ విశ్వంభర స్వామి, ఉపసర్పంచ్ నరేష్,కరణం శ్రీనివాస్,కిరణ్ గౌడ్,వార్డు సభ్యులు శ్రీనివాస్,యాదగిరి, గ్రామ కార్యదర్శి మోహన్, మల్లేశం,శ్రీశైలం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News