Homeవరంగల్‌Mangapet Mandal | తూ.. తూ మంత్రంగా జరిగిన మంగపేట మండల అధికారుల సర్వసభ్య సమావేశం

Mangapet Mandal | తూ.. తూ మంత్రంగా జరిగిన మంగపేట మండల అధికారుల సర్వసభ్య సమావేశం

  • “ప్రగతి, పురోగతి” లేని ప్రగతి నివేదికలకి మాత్రమే పరిమితమై

ఏటూరునాగారం: ములుగు జిల్లా మంగపేట మండల(Mangapet Mandal) ప్రత్యేక అధికారుల సమావేశం మండల ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీ ఆఫీసర్ కొండా వెంకయ్య అధ్యక్షతన శుక్రవారం మండల కేంద్రంలో నీ అన్నదాతల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన “రైతువేదిక” లో నిర్వహించారు. ప్రతీ నెలా యధాలాపంగా జరిగే ఈ సమావేశం ఈరోజు కూడా తూ.. తూ మంత్రంగానే నిర్లిప్తంగా,నిర్లక్ష్యంగా నిర్వహించారు.మంగపేట మండలంలో గత 18 ఏళ్లుగా స్థానిక సంస్థల కి ఎన్నికలు జరుగకపోవడంతో ప్రజాప్రతినిధులైన స్థానిక సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, కో- ఆప్షన్ సభ్యులు ఎవరూ కూడా లేక పోవడం తో రాజు లేని రాజ్యం గా మారింది. అధికారులు,ఉద్యోగ సిబ్బంది ఆడిందే ఆటగా..పాడిందే పాట గా మారిందని చెప్పవచ్చు.

దీంతో ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన 28 మంది అధికారులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం పది మంది శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది మాత్రమే హాజరు కావడం అనవాతీగా మారింది.సమావేశం ఏర్పాటు అయిన అరగంటలోనే అక్కడికి వచ్చిన సదరు పదిమంది శాఖల అధికారులు, సిబ్బంది తూ.. తూ మంత్రంగా యథాలాపంగా చెప్పుకొనేంతగా ప్రగతి,పురోగతి లేని తమ శాఖల ప్రగతి నివేదికలు చదివి వినిపించడం జరిగినది.ఇక ఈ సమావేశంలో నామ్ కే వస్తి గా ఎల్లప్పుడూ ఉండే ఎంపిడిఓ భూక్యా భద్రు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రోహిత్ హోసింగ్ ఏఈ మనస్విని, ఐకెపి ఎపియం సత్యనారాయణ, వి బి జి రామ్ జి ఎపిఓ లు తమ శాఖల ప్రగతి నివేదికలను తూ తూ మంత్రంగా యథాలాపంగా చదివి వినిపించారు.

- Advertisement -

మంగపేట రైతు వేదికలో జరిగిన ఈ మండల ప్రత్యేక సమావేశం కొండా వెంకయ్య మండల ప్రత్యేక అధికారి, అధ్యక్షతన మండల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొందరు శాఖల అధికారులు,ఉద్యోగ సిబ్బంది మాత్రమే హాజరు అయివారి శాఖల ప్రగతి నివేదికలకి పరిమితమయ్యారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ శ్రీ భద్రు ఆర్ డబ్ల్యూ,ఎస్ ఏ ఈ. నవీన్, రోహిత్ ఇరిగేషన్, మనస్విని హోసింగ్, ఎపియం సత్యనారాయణ, వి.బి.జి రామ్ జి ఎపిఓ అంకుష్ , ఫారెస్ట్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు హాజరు అయ్యారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News