- ’హైడ్రా బతుకమ్మ’ షార్ట్ ఫిల్మ్‌కు పార్టిసిపేషన్ అవార్డు…
- శిల్పకళా వేదికలో వెన్నెలక్క చేతుల మీదుగా పురస్కారం స్వీకరణ.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్’లో ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన రాగం సాంబశివరావు ప్రతిభ చాటారు. ఆయన రూపొందించిన “హైడ్రా బతుకమ్మ”(Hydra Bathukamma) షార్ట్ ఫిల్మ్‌కు గాను ‘పార్టిసిపేషన్ అవార్డు'(Participation Award) దక్కింది.
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో గద్దర్ కుమార్తె వెన్నెలక్క చేతుల మీదుగా సాంబశివరావు ఈ అవార్డును(Award) మర్యాదపూర్వకంగా స్వీకరించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను, సంస్కృతిని చాటిచెప్పేలా ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలో ని మరికాల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విజయ్, ఆయన భార్య శ్రావణితో పాటు పాఠశాల విద్యార్థులు కీలక పాత్రల్లో నటించి తమ నటనా ప్రతిభతో అలరించడం విశేషం.
విద్యార్థులు ఈ చిత్రంలో భాగస్వాములై పండుగ ప్రాధాన్యతను చక్కగా ప్రతిబింబించారు. తమ మండల కేంద్రానికి చెందిన రాగం సాంబశివరావు రాష్ట్రస్థాయి వేదికపై ఈ అవార్డును అందుకోవడం పట్ల వెంకటాపురం స్థానికులు, గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా షార్ట్ ఫిల్మ్ రూపకర్త సాంబశివరావుతో పాటు, ఇందులో నటించిన ఉపాధ్యాయుడు విజయ్, శ్రావణి మరియు విద్యార్థులకు పలువురు ప్రముఖులు, స్థానికులు అభినందనలు తెలియజేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
