- ఏండ్రియల్ గ్రామంలో నవ్యశ్రీని అభినందించిన గ్రామస్తులు
తాడ్వాయి: స్టేట్ లెవల్ కబడ్డీ ఆటలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియల్ గ్రామానికి చెందిన నవ్య శ్రీ ని శనివారం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.(Honour) ఈనెల 13వ తేదీన మధ్యప్రదేశ్ లోని బేతల్లో జరిగిన అండర్ 14 బాలికల విభాగంలో కామారెడ్డి శిశు మందిర్ హై స్కూల్ తరఫున ఆడిన కబడ్డీ జట్టు ప్రథమ స్థానం గెలుపొంది నేషనల్ లెవెల్ కు(National Level Kabaddi) ఎన్నికయింది.

ఆ జట్టులో వైస్ కెప్టెన్ గా నవ్యశ్రీ ఆటలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రావు అధ్యక్షతన గ్రామస్తులు బాలికకు ఘన సన్మానం చేశారు. కబడ్డీ ఆటలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అందుకు తమ గ్రామం తరపు నుండి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏండ్రియల్ గ్రామ సర్పంచ్ కొర్ని నర్సిములు,చిట్యాల గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి, మేకల రాజు, ఏండ్రియల్ గ్రామస్తులు నవీన్ రెడ్డి,రామ స్వామి, మైపాల్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

