- ఉపగ్రహ చిత్రాల్లో బయటపడుతున్న భూమి మార్పులపై ప్రశ్నలు
- జీఓల వక్రీకరణ.. ఎలఆరఎస్ మాఫియా అవతారం..
- ఎలఆరఎస్-2020 నిబంధనల అమలుపై అనుమానాలు
- పాత పత్రాలతో కొత్త లేఅవుట్కు అర్హత కల్పించారన్న ఆరోపణలు
- సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- 76 ప్లాట్లు, 30 భవన నిర్మాణ అనుమతులపై దర్యాప్తునకు డిమాండ్
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 368/1 అక్రమాల పుట్టగా(Irregularities) మారింది. చట్టాన్ని లెక్కచేయమంటూ కొందరు అక్రమార్కులు సాగిస్తున్న లేఅవుట్ దందా ఇప్పుడు నగరంలో పెను సంచలనంగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల కనుసన్నల్లో సాగుతున్న ఈ భారీ అవినీతి లీలలపై ఇప్పుడు అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు అక్కడ లేఅవుట్ ఎప్పుడొచ్చింది? ఎలఆరఎస్–2020 నిబంధనలను ఎలా అన్వయించారు? జీఓ ఎం.ఎస్. నం.28ని తమ స్వార్థానికి ఎలా వక్రీకరించారనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం కరవైంది.

ఈ అక్రమ తంతుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు విస్తుపోయే నిజాలను నిర్భయంగా బట్టబయలు చేస్తున్నాయి. 2020 ఫిబ్రవరి నాటికి ఆ సర్వే నంబర్లో కనీస జాడ కూడా లేకుండా బీడు భూమిలా ఉన్న ప్రాంతం.. 2026 ఆగస్టు నాటికి ఇష్టానుసారంగా ప్లాట్లుగా మారిపోయింది. అంతర్గత రహదారులు, అక్రమ నిర్మాణ కార్యకలాపాలు ఇట్టే కంటికి కనిపిస్తున్నప్పటికీ, అధికారుల కళ్లు మాత్రం తెరుచుకోకపోవడం వెనుక అసలు మతలబు ఏమిటి? 2020 ఆగస్టు 26 నాటికి ఈ ప్రాంతంలో కనీసం గుర్తింపు పొందిన లేఅవుట్ ఉనికిలో ఉందా? లేదా? అన్నదానిపై ఇప్పుడు తీవ్రమైన అనుమానాలు రేకెత్తుతున్నాయి.

జీఓ నం.28 సాకుతో నిబంధనలకు తూట్లు! : 2025 ఫిబ్రవరి 20న జారీ చేసిన జీఓ ఎం.ఎస్. నం.28ని అడ్డుపెట్టుకుని ఇక్కడ పెద్ద స్థాయిలోనే దందా నడిపారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పాత లేఅవుట్ లావాదేవీలను, వేరే ప్రాంతాలకు సంబంధించిన సేల్ డీడ్లను అడ్డంపెట్టి ప్రస్తుత కొత్త లేఅవుట్కు అర్హత కల్పించేశారనే విమర్శలు తీవ్రతరం అయ్యాయి. అసలు ఈ ప్లాట్లు అవే భూభాగానికి చెందినవా? లేక పక్కనున్న వేరే లేఅవుట్ ప్లాట్లను చూపి అధికారులను నమ్మించారా? అన్నదానిపై విచారణ జరిగితేనే అసలు నిజాలు బయటపడతాయి. ఈ నిబంధనల ఉల్లంఘన పర్వంలో భాగంగానే ఏకంగా 76 ప్లాట్లకు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేశారు.

అంతేకాదు, దీనికి కొనసాగింపుగా 2025, 2026 సంవత్సరాల్లో ఏకంగా 30 భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయించుకోవడం చూస్తే ఈ మాఫియా వేర్వేరు వ్యవస్థలను ఎంతగా మేనేజ్ చేసిందో అర్థమవుతోంది. మూల లేఅవుట్ చట్టబద్ధతను గాలికి వదిలేసి, నిబంధనలకు విరుద్ధంగా వరుసబెట్టి అనుమతులు జారీ చేయడం వెనుక పెద్ద తతంగమే నడిచిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
‘రెగ్యులేటరీ ఆర్బిట్రేజ’తో చక్రం తిప్పిన శక్తులు? : ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఉద్దేశించిన నిబంధనలను, తమ స్వార్థం కోసం వక్రీకరించి వాడుకోవడాన్ని ‘రెగ్యులేటరీ ఆర్బిట్రేజ’ అంటారు. నాదర్గుల్ వ్యవహారంలో అచ్చంగా ఇదే జరిగిందన్న విమర్శలున్నాయి. ఏ లేఅవుట్ అర్హత లేకుండానే పాత పత్రాలను చూపుతూ ఎలఆరఎస్ పొంది, ఆపై రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతులు పొందేలా కొందరు చక్రం తిప్పారు.

ఈ మొత్తం అక్రమాలపై(Irregularities) ఇప్పటికే జీహెచఎంసీ కమిషనర్, శంషాబాద్ జోనల్ కమిషనర్, బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు వినతిపత్రం అందజేయగా, 2026 సెప్టెంబర్ 21న ఈ-ఆఫీస్ ద్వారా రసీదు కూడా జారీ అయింది. తొలి దశ రికార్డుల నుంచి చివరి దశ భవన అనుమతుల వరకు ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే సాగింది. ఇది కేవలం ఒక భూభాగానికి సంబంధించిన సమస్య కాదు.. నగర శివారులో నిబంధనలను కాలరాస్తూ సాగుతున్న బరితెగింపు ధోరణులకు ఇది నిలువెత్తు నిదర్శనం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర విచారణ జరిపితేనే ఈ కుంభకోణంలో తెరవెనుక ఉన్న పెద్దల బండారం బయటపడుతుంది!(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
