Homeఆదిలాబాద్EVM Security Check | ఈవీఎం గోదాంలో భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ

EVM Security Check | ఈవీఎం గోదాంలో భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ

నిర్మల్ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం (EVM Security Check) గోదాంను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలోని రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేసి, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక వ్యవస్థల సన్నద్ధతను సమీక్షించారు. ఈవీఎం (EVM Security Check) గోదాం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. పోలీసు సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

Bhavesh Mishra Inspects EVM Warehouse Security3
Bhavesh Mishra Inspects EVM Warehouse Security5

భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలని సూచించారు. ఈ తనిఖీలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, డీపీఆర్వో ఇ. విష్ణువర్ధన్, తహసీల్దార్ రాజు, అధికారులు స్వాతి, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News