Homeవరంగల్‌Excellence | వైష్ణవ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలీ..

Excellence | వైష్ణవ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలీ..

  • తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగించాలి..
  • వైష్ణవి పురస్కారాలు అందజేత..
  • కార్యక్రమంలో పాల్గొన్న రాజనాల శ్రీహరి, దరిపెళ్లి సంపత్..

వైష్ణవ విద్యార్థులు కష్టపడి చదివి వైష్ణవ కులానికి మంచి పేరు తేవాలని, విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించి(Excellence ) మంచి పేరు తెచ్చుకొని తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగించాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, వైష్ణవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దరిపెళ్లి సంపత్ సూచించారు. ఆదివారం వరంగల్ శివనగర్ ప్రాంతంలోని శ్రీ వైష్ణవి సంఘం వరంగల్ ప్రతిభ పుష్కరాలను సవాధ్యక్షులుగా వెలుగులేటి సేనాచార్యులు వహించగా అతిథులుగా గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, శ్రీమాన్ దరఖాశయం కటూరి ఇందుమతి, కందల కృష్ణమాచార్యులు, రాష్ట్ర వైష్ణవ సంఘ ఉపాధ్యక్షులు దరిపెళ్లి సంపత్ వెంకటరమణ తో పాటు, శ్రీ వైష్ణవి సభ్యులు కాటూరి శ్రవణ్ కుమార్ హరితలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అతిథుల చేత వైష్ణవ పురస్కార విద్యార్థులకు నగదు తోపాటు శాల్వా షీల్డ్ అందించారు. ఈ సందర్భంగా రాజనాల శ్రీహరి, దరిపల్లి సంపత్ మాట్లాడుతూ అయోధ్య విగ్రహాలను శ్రీ రామానుజ చార్యులు, నాలుగువేల విగ్రహాలను తెలంగాణలో ఉన్న భక్తులకు, ప్రజలందరికీ అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరిని వైష్ణవ సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైష్ణవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News