Homeరంగారెడ్డిSC Cell President | చంద్రపురి కాలనీ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాహుల్ కదం

SC Cell President | చంద్రపురి కాలనీ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాహుల్ కదం

జవహర్‌నగర్: చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కదం రాహుల్(SC Cell President Kadam Rahul) నియమితులయ్యారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ రాహుల్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ రాబోయే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గెలుపు కోసం ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

నూతనంగా నియమితులైన రాహుల్ కదం మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పార్టీ అభ్యర్థుల విజయానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెన్నయ్య, డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్‌తో పాటు తన నియామకానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు గడ్డం శ్రీనివాస్, ఏ బ్లాక్ అధ్యక్షుడు మాట్లా శ్రీనివాస్, మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, మాజీ ఉప మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బల్లి శ్రీనివాస్, మాట్లా వినయ్ కుమార్, వెంకటేశ్, భాస్కర్, పసుపులేటి భాస్కరరావు. నర్రా మహేష్. సోమేశ్ చారి, కాలేశా, రఫీక్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు.పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News