Homeహైదరాబాద్‌Kalvakuntla Kavitha | భక్తులకు సరైన వసతులు కల్పించాలి..

Kalvakuntla Kavitha | భక్తులకు సరైన వసతులు కల్పించాలి..

  • వేలాది మంది భక్తులు వచ్చే మందిరం..
  • కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయటం ప్రభుత్వం బాధ్యత..
  • డిమాండ్ చేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
  • ఫలక్ నుమా ఖాళీ మాతా ఆలయాన్ని సందర్శించి
  • ప్రత్యేక పూజలు చేసిన టీఆర్ఎస్ చీఫ్


ఫలక్ నుమా ఖాళీ మాతా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha).. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫలక్ నుమా ఖాళీ మాతా టెంపుల్ అంటే ఓల్డ్ సిటీలో పవర్ ఫుల్. హైదరాబాద్ ప్రజలందరికీ ఎంతో నమ్మకం.. భక్తులందరికీ కూడా కొంగు బంగారం. వేలాది మంది భక్తులు నిత్యం అమ్మవారి ఆశీర్వాదం కోసం ఇక్కడకు వస్తుంటారు.. అమ్మవారికి ముడుపు కడితే అనుకున్న కోరికలు తీరుతాయి. నేను కూడా ముడుపు కట్టాను.. అమవాస్య రోజు ఇక్కడకు ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.. ఇవ్వాళ పెత్తరమాస. అదే విధంగా బతుకమ్మ పండుగ మొదలవుతుంది.. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.. కానీ వేలాదిగా భక్తులు వచ్చే ఖాళీ మాతా ఆలయం వద్ద భక్తులకు సరైన వసతులు లేకపోవటం బాధాకరం.. కనీసం రోడ్డు సౌకర్యం లేదు.

మహిళలకు వాష్ రూమ్ లు కూడా సరిగా లేవు.. చుట్టు రైల్వే ల్యాండ్స్ ఉండటంతో పాటు పక్కనే స్మశానం ఉంది. దీంతో ఇక్కడ రోడ్డు కూడా వేసే పరిస్థితి కూడా లేదు.. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ రోడ్డు వేయించేందుకు రైల్వే నుంచి ల్యాండ్ ఇప్పించే ప్రయత్నం చేయాలి.. ఎండోమెంట్ డిపార్ట్ మెంట్, రైల్వే శాఖలను సమన్వయం చేస్తూ ఇక్కడ రోడ్డు వేయించేందుకు రైల్వే శాఖతో మాట్లాడుతాం.. అలాగే భక్తులకు కనీస వసతులు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.. ఇన్ని వందల మంది భక్తులు వచ్చే చోట కనీస సౌకర్యాలు కల్పించటం ప్రభుత్వం బాధ్యత.. ఫలక్ నుమా అమ్మవారి ఆలయంలో వసతులు లేవని సాయి అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా మా వరకు తెచ్చాడు.. సోషల్ మీడియాను నెగిటివ్ గా వాడుతున్న ఈ కాలంలో సాయి అనే యువకుడు ఆయన టీమ్ ఇలాంటి మంచి చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా అన్నారు (Kalvakuntla Kavitha).. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News