Homeనల్లగొండPolice Raid | పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 9మంది అరెస్ట్

Police Raid | పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 9మంది అరెస్ట్

మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై మండల ఎస్సై బి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి (Police Raid) చేసి పట్టుకున్నారు.అక్టోబర్ 8న రాత్రి 10 గంటల సమయంలో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మంది పోలీసులకు పట్టుబడ్డారు.

వారిని మస్తాన్, హసన్, సైదా వలి, నాగుల్ మీరా, గురువులు, సైదులు, వెంకటనారాయణ, జాని, సైదా నాగుల్ మీరగా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.15,200 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా రఘునాథ పాలెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మట్కా,జూదం, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News