HomeజాతీయంPoultry India Expo-2026 | వికసిత్ భారత్ దిశగా పౌల్ట్రీ పరిశ్రమ

Poultry India Expo-2026 | వికసిత్ భారత్ దిశగా పౌల్ట్రీ పరిశ్రమ

  • నవంబరు 25 నుంచి హైదరాబాద్‌లో 18వ ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026’
  • హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ప్రదర్శన.. 24న ‘నాలెడ్జ్ డే’ సదస్సు
  • గుడ్ల ఉత్పత్తిలో భారత్‌కు అంతర్జాతీయంగా రెండో స్థానం
  • దిల్లీలో ఎక్స్‌పో వివరాలు వెల్లడించిన ఐపీఈఎంఏ ప్రతినిధులు

న్యూ ఢిల్లీ: దేశీయ పౌల్ట్రీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 18వ ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026’కు(Poultry India Expo-2026) హైదరాబాద్‌ నగరం వేదిక కానుంది. నవంబరు 25 నుంచి 27 వరకు మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ మహా ప్రదర్శన జరగనుంది. ఈ మేరకు గురువారం దిల్లీలోని ‘ది పార్క్’ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ప్రతినిధులు వివరాలు వెల్లడించారు.

24న నాలెడ్జ్ డే సదస్సు

ఎక్స్‌పో ప్రారంభానికి ముందురోజు, నవంబరు 24న హెచ్‌ఐసీసీ–నోవోటెల్‌లో ‘నాలెడ్జ్ డే’ పేరుతో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. కోళ్ల ఆరోగ్యం, దాణా నిర్వహణ, బయోసెక్యూరిటీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పౌల్ట్రీ రంగంలో సుస్థిర పద్ధతులపై నిపుణులు విస్తృతంగా చర్చించనున్నారు. అనంతరం 25 నుంచి 27 వరకు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిబిషన్ సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

550కి పైగా సంస్థలు.. 120 దేశాల నిపుణులు

ఈ ప్రదర్శనలో 550కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులు, సేవల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి సుమారు 51 వేల మందికి పైగా పరిశ్రమ ప్రతినిధులు, పౌల్ట్రీ రైతులు, బ్రీడర్లు, పశువైద్యులు, పరిశోధకులు హాజరుకానున్నారు. జన్యు సాంకేతికత, అత్యాధునిక హేచరీలు, ఫార్మ్ ఆటోమేషన్, పౌల్ట్రీ షెడ్లు, వెంటిలేషన్ వ్యవస్థలు, వ్యాధి నిర్ధారణ పరికరాలు, గుడ్ల ప్రాసెసింగ్, వ్యర్థాల నిర్వహణ వంటి విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఐపీఈఎంఏకు ఇప్పటికే 20కి పైగా అంతర్జాతీయ సంఘాలు, 40 జాతీయ స్థాయి సంస్థలతో భాగస్వామ్యం ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఉత్పత్తిలో దూకుడు

దేశంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో 142.77 బిలియన్ గుడ్లు ఉత్పత్తి కాగా, భారత్ అంతర్జాతీయంగా రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. బ్రాయిలర్ మాంసం ఉత్పత్తిలోనూ ప్రపంచంలోనే తొలి నాలుగు స్థానాల్లో ఒకటిగా నిలిచిందని ఐపీఈఎంఏ పేర్కొంది. గతేడాది సుమారు 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరిగిన ఎక్స్‌పోలో 500కు పైగా సంస్థలు, 51,251 మంది ప్రతినిధులు పాల్గొన్నట్లు వివరించింది.

“రాబోయే రోజుల్లో పౌల్ట్రీ పరిశ్రమలో అనేక సంస్కరణలు, ఆధునిక పోకడలు రానున్నాయి. యువత ఈ రంగంలో విస్తరిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి.”(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

ఉదయ్ సింగ్ బయాస్ , పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు

- Advertisement -
RELATED ARTICLES

Latest News