HomeతెలంగాణTelangana government | గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

Telangana government | గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

  • దసరా కానుకగా రెండు విడతల కరువు భత్యం మంజూరు..
  • ఈరోజు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..

దసరా పండుగ ముందు తెలంగాణ ప్రభుత్వ (Telangana government) ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న రెండు విడతల కరవు భత్యాన్ని మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెలువరించింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, 2024 జనవరి 1 నుంచి డీఏ 33.67 శాతం నుంచి 37.31 శాతానికి, 2024 జులై 1 నుంచి 40.04 శాతానికి పెరగనుంది. దీంతో ఉద్యోగుల డీఏ మొత్తం 6.37 శాతం పెరిగినట్లయింది. పెరిగిన డీఏను అక్టోబరు నెల వేతనంతో కలిపి చెల్లించనున్నారు. అంటే నవంబరు 1వ తేదీన ఈ మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో జమ కానుంది. 2024 జనవరి నుంచి 2026 సెప్టెంబర్ వరకు పేరుకుపోయిన బకాయిలను జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాల్లో జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే వారికి ఈ బకాయిలను విడతల వారీగా చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Advertisement -

ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా సుమారు రూ. 2,500 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా. కేవలం బకాయిల చెల్లింపు కోసమే దాదాపు రూ. 6,174 కోట్లు అవసరమవుతాయి. తాజా పెంపుతో రాష్ట్రంలోని సుమారు 7 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర అర్హత కలిగిన సిబ్బంది లబ్ధి పొందనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు, ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే వెల్లడించారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News