Homeమహబూబ్‌నగర్‌Niranjan Reddy | పంపులు నడపకపోతే.. నార్లాపూర్ ముట్టడే!

Niranjan Reddy | పంపులు నడపకపోతే.. నార్లాపూర్ ముట్టడే!

  • రైతులతో కలిసి సోమవారం నార్లాపూర్‌ను దిగ్బంధిస్తాం.
  • ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి..
  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరిక..

నార్లాపూర్ పంపులను వెంటనే నడిపించి రైతులకు సాగునీరు అందించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించాలని బుధవారం వారి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పంపులను నడపడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సోమవారం రైతులతో కలిసి నార్లాపూర్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. రైతుల పంటలకు సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నీటి లభ్యత ఉన్నప్పటికీ పంపులను నడపకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన అన్నారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే నార్లాపూర్ పంపులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సంవత్సరం పొడుగునా తాగునీటికి తొమ్మిది టీఎంసీల నీళ్లు సరిపోతాయని, మిగిలిన నీటిని పంటలు చివరి దశలో ఉన్నాయని.. రైతులకు కోతులు లేని కరెంటు, నీటిని అందించి పంటలను కాపాడాలని సూచించారు. సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంతో రైతులు విలువలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

ప్రభుత్వం స్పందించి పంపులను నడపకపోతే రైతులతో సోమవారం నార్లాపూర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అవసరమైతే నార్లాపూర్‌ను ముట్టడిస్తామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల సాగునీటి హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడుతామని ఆయన హెచ్చరించారు.

ఇక మాటలు కాదు.. ఆధారాలతో తేల్చుకుందాం!..

పొంగులేటి ఎండార్స్ లెటర్లు తీసుకురా.. నాపై ఆరోపణలకు రుజువులు చూపించు..

రాష్ట్ర మీడియా ముందే నిజం – అబద్ధం ప్రజలే తేల్చాలి..
మంత్రి జూపల్లికి బహిరంగ సవాల్..

కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడదామని..

ఆరోపణలకు ఆధారాలతో రండి .. రాష్ట్ర మీడియా సమక్షంలో నిజానిజాలు తేల్చుకుందాం అని మంత్రి జూపల్లికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎండార్స్ చేసిన లేఖలు, తనపై మీరు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో రావాలని, తనపై వచ్చిన ఆరోపణలు, వాటికి సంబంధించిన వాస్తవాలను రాష్ట్ర మీడియా సమక్షంలో ప్రజల ముందుంచి చర్చిద్దామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని ఆయన విమర్శించారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని, అయితే ఆ అంశాలను పక్కనపెట్టి కేసీఆర్‌ నుంచి కింది స్థాయి నాయకుల వరకు వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. లక్ష్యం కోసం చిత్తశుద్ధితో 23 సంవత్సరాలు పనిచేశానని.. ఉద్దేశపూర్వకంగా లేనిపోని విమర్శలు చేస్తూ నిర్ధారణ చేయలేని దద్దమ్మలు అని ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలకు బదులుగా ఆధారాలతో మాట్లాడే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడదామని పిలుపునిచ్చారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎండార్స్ చేసినట్లు పేర్కొంటున్న లేఖలను, తనపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను బహిరంగంగా తీసుకురావాలని ఆయన కోరారు. మీడియా సమక్షంలో ఇరువైపుల వాదనలు, ఆధారాలను ప్రజల ముందుంచితే అసలు వాస్తవాలు ప్రజలకు స్పష్టమవుతాయని అన్నారు. తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేస్తూ, మంత్రి జూపల్లి కృష్ణారావు ఎప్పుడు వస్తారో కనీసం రెండు రోజుల ముందుగానే తనకు సమాచారం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. ఈ సవాల్‌పై జూపల్లి కృష్ణారావు ఎలా స్పందిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇద్దరు నేతల మధ్య పలు సందర్భాల్లో రాజకీయ విభేదాలు, ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో తాజా బహిరంగ సవాల్ చర్చకు దారితీస్తోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News