- పలుకోణాల్లో ఆరా తీస్తున్న పోలీసులు..
- యూపీలోని బృందావన్ లో ఆశ్రమం..
ఆధ్యాత్మిక బోధనలతో సోషల్ మీడియాలో ఆదరణ పొందిన ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమంలో శిష్యుడు రసిక్ దులారీ(Rasik Dulari) మృ*తి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సెప్టెంబరు 25న ఆశ్రమంలోని నాలుగో అంతస్తు నుంచి కిందపడి రసిక్ మృ*తిచెందిన విషయం తెలిసిందే. తొలుత దీన్ని ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. ప్రస్తుతం పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమం ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో ఉంది.
ఆశ్రమంలో శిష్యుల మొబైల్ ఫోన్ వినియోగంపై ఉన్న నిబంధనలపై పోలీసులు దృష్టి పెట్టారు. శిష్యుడిగా చేరిన తర్వాత వ్యక్తిగత ఫోన్ను తీసుకుని.. ఆశ్రమం తరఫున కొత్త ఫోన్, సిమ్ కార్డు ఇచ్చేవారని సమాచారం. ఆ ఫోన్లను ఎలా ఉపయోగించేవారు? వాటిపై ఏమైనా పర్యవేక్షణ ఉండేదా? కాల్స్, ఇతర సమాచారాన్ని ఎక్కడ భద్రపరిచేవారు? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
బయటివారితో శిష్యుల సంబంధాలపైనా ఆరా తీస్తున్నారు.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంతవరకు మాట్లాడేవారు? వారితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయా? రసిక్(Rasik Dulari) తనకు ఎదురైన ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడి గురించి ఎవరితోనైనా చెప్పాడా? అనే వివరాలను కుటుంబ సభ్యులు, సన్నిహితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆశ్రమంలో చేరకముందు రసిక్ జీవితం ఎలా ఉండేది? ఆ తర్వాత అతడి ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చాయా? అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. అతడి పాత ఫోన్, కొత్త సిమ్, కాల్ డేటా, చాట్స్ సహా డిజిటల్ ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
