- డిగ్రీ లేకున్నా సివిల్స్ కోచింగ్ పేరుతో అడ్మిషన్లు..
- హాస్టల్ పేరుతో పీజీ భవనాల్లో విద్యార్థుల వసతి..
- ఆకర్షణీయ ప్రకటనలతో గ్రామీణ విద్యార్థులకు వల..
- పుట్టగొడుగుల్ల వెలుస్తున్న అనధికార అకాడమీలపై చర్యలు ఏవీ..
- ప్రజ్ఞ అకాడమీపై సమగ్ర విచారణకు విద్యార్థి సంఘాల డిమాండ్..
రాష్ట్ర రాజ ధానిలోని ప్రముఖ విద్యా కేంద్రమైన అశోక్ నగర్ వేదికగా సాగు తున్న ‘ప్రజ్ఞ ఐఏఎస్ అకాడమీ’(Pragnya IAS Academy) దందాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీ యాంశంగా మారాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును అడ్డం పెట్టుకుని, నాణ్యమైన కోచింగ్, సివిల్స్‌లో విజయం సాధింపజే స్తామంటూ ఆకర్షణీయమైన ప్రకటనలతో అమాయక గ్రామీణ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఈ సంస్థ నిలువునా దోచు కుంటోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ సాగి స్తున్న ఈ అక్రమాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యూపీఎస్సీ నిబంధనలకు తూట్లు – చట్టవిరుద్ధ అడ్మిషన్లు : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలంటే కనీసం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కానీ, కేవలం పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు సైతం సివిల్స్ కోచింగ్ ఇస్తామంటూ ప్రజ్ఞ ఐఏఎస్ అకాడమీ(Pragnya IAS Academy) నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతూ యువతను తప్పుదారి పట్టిస్తోంది.
ఇంటర్మీడియట్ బోర్డు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి లేదా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎలాంటి అధికారిక అనుమతులు, అఫిలియేషన్ పొందకుండానే ఈ అకాడమీ కాలేజీల పేరుతో మోసాలకు పాల్పడుతోంది. కేవలం కోచింగ్ సెంటర్‌గా మాత్రమే అనుమతి పొంది, తెరవెనుక అనధికారికంగా ఇంటర్, డిగ్రీ కాలేజీల పేరుతో విద్యార్థులను చేరుస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
మాయమాటల ప్రకటనలు : బ్రోచర్లు, సోషల్ మీడియా వేదికగా ఆధునిక వసతులు, 24 గంటల పర్యవేక్షణ, పకడ్బందీ భద్రత అంటూ యాజమాన్యం హోరెత్తిస్తున్న ప్రకటనలు అన్నీ తూతూ మంత్రమేనని బాధితులు వాపోతు న్నారు. హాస్టల్ సదుపాయం కల్పిస్తామని నమ్మిం చి, తీరా చూస్తే కనీస సౌకర్యాలు లేని, ఇరుకైన పేయింగ్ గెస్ట్ (పీజీ) భవనాలలో విద్యార్థులను ఉంచుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడు తున్నారని తల్లి దండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలేజ్ ఒక ప్రాంతంలో, హాస్టల్ మరో చోట ఉండటంతో ప్రతిరోజూ రవాణా ఇబ్బందులతో విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురవు తున్నారు. సంస్థ మోసపూరిత విధానాలను గ్రహించి ఒక్క రోజు లోనే వెనక్కి వెళ్లిన విద్యార్థికి చెల్లించిన రూ.73,000 ఫీజును తిరిగి ఇవ్వకుండా యాజమాన్యం తీవ్ర జాపయం చేస్తూ, డబ్బుల విషయంలోనూ దోపిడీకి పాల్పడుతోంది.
అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి..? – విద్యార్థి సంఘాల డిమాండ్ : అశోక్ నగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలలో నిబంధన లకు విరుద్ధంగా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న ఇలాంటి నకిలీ అకాడమీలు, అనధికార హాస్టళ్లపై విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యామండలి, జీహెచఎంసీ అధికారులు తక్షణమే స్పందించా లని కోరుతున్నారు. విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి వ్యాపా రం చేస్తున్న ఈ సంస్థ గుర్తింపును వెంటనే రద్దుచేసి, యాజ మాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయా లని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
బాధితుడికి పూర్తి ఫీజును వెంటనే తిరిగి చెల్లించడంతోపాటు, ఇలాంటి సంస్థల మోసాలపై సమగ్ర విచారణ చేపట్టక పోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తా మని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అనధి కార అకాడమీల మోసాలపట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండా లని విద్యావేత్తలు సూచిస్తున్నారు. స్పష్టమైన నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే వరకు ఈ ఆందోళనలు ఆగవని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
