Homeమహబూబ్‌నగర్‌Market Relocation | వారాంతపు సంతను నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌కు తరలించాలి.

Market Relocation | వారాంతపు సంతను నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌కు తరలించాలి.

  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి పట్టణంలో ప్రతి వారం నిర్వహించే వారాంతపు సంతను నూతనంగా నిర్మించి, (Market Relocation) ప్రస్తుతం వినియోగంలో లేకుండా ఉన్న మున్సిపల్ కూరగాయల మార్కెట్‌లోకి తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ తో కలిసి పట్టణంలో కందకంలో నిర్మించి, వృధాగా ఉన్న మున్సిపల్ కూరగాయల మార్కెట్ ను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. వారాంతపు సంత నిర్వహణకు (Market Relocation) అవసరమైన మౌలిక సదుపాయాలు, వ్యాపారులకు అనుకూలమైన వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వృథాగా ఉన్న మున్సిపల్ కూరగాయల మార్కెట్‌ను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలని .. సంతను నూతన ప్రాంతానికి తరలించడం ద్వారా వ్యాపారులు, కొనుగోలుదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పట్టణంలో ట్రాఫిక్, పారిశుద్ధ్య సమస్యలను కూడా నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులకు తెలిపారు.

- Advertisement -

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూరగాయల మార్కెట్ కు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News