- ప్రయాణికుల కోసం ప్రకటించిన ఆర్టీసీ ఎంక్వైరీ నంబర్..
- సమాచారం కోసం ఫోన్ చేస్తే అంతే సంగతి.
పాపన్నపేట ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుల సమాచారం కోసం ఎంక్వైరీ నంబర్‌ను ప్రకటించిన మెదక్ ఆర్టీసీ(Medak RTC) అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకటన వెలువడి కనీసం 24 గంటలు కూడా గడవకముందే ఆ నంబర్‌కు ప్రయాణికులు ఫోన్ చేస్తే చేరుకోకపోయేసరికి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
బస్సుల రాకపోకలు, సమయాలు, ఇతర ప్రయాణ వివరాల కోసం 7842651529 నంబర్‌ను సంప్రదించాలని మెదక్ డిపో మేనేజర్ పరమేశ్వరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే అదే నంబర్‌కు ఫోన్ చేయగా కలవకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. ప్రయాణికుల కోసం ప్రకటించిన నంబర్‌నే అందుబాటులో ఉంచకపోతే ఎంక్వైరీ సేవల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రజలకు సమాచారం అందించాల్సిన ఎంక్వైరీ నంబర్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని, పనిచేసే మరో నంబర్ ను ప్రత్యామ్నాయ నంబర్ గా ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
డిపో మేనేజర్ వివరణ: ఇదే విషయమై డిపో మేనేజర్ పరమేశ్వరి ని “ఆదాబ్” వివరణ కోరగా సదరు కంట్రోలర్ సంగారెడ్డిలో మీటింగ్ కు వెళ్లాడని, అందుకే స్విచ్ ఆఫ్ లో ఉందని, కాసేపటి తర్వాత అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
