నిమజ్జనం అంటే కేవలం మట్టి గణపతిని నీళ్లల్లో ముంచేసి రావడం కాదు బాయ్..! అది భక్తుని ఓపికకు, పోలీసుల గట్టి బందోబస్తుకు, సమాజం మీద మనబాధ్యతకు అసలైన అగ్నిపరీక్ష. భక్తి జోష్లో బాధ్యత మరిచిపోకుండా, ఖాకీ అన్నల సూచనలు పాటిస్తూ, రూల్స్ ప్రకారమే నడుచుకుంటూ.. మన గణనాథుని సాగనంపు గొడవల్లేకుండా పండుగ వాతావరణంలో జరగాలి. భద్రత మనకు షీల్డ్ లాంటిది.ఓపిక మన సంస్కృతికి అద్దం పడుతుంది.చెప్పిన రూట్లోనే పోవాలి, ఇష్టం వచ్చినట్టు పోదామంటే కుదరదు. కిటకిటలాడే జనంలో పిల్లలు, ముసలోళ్ల జాగత్త మన చేతుల్లోనే ఉంది. వీలైనంత వరకు మట్టి విగ్రహాలనే వాడి, పర్యావరణాన్ని కాపాడుకుందాం. జైబోలో గణేశ్ మహారాజ్ కీ జై.. సేఫ్ అండ్ గ్రీన్ నిమజ్జనం చేద్దాం బాయ్..(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
Aaj Ki Baath
