- ఏడుగురిపై కేసు.. రూ.8,740 నగదు సీజ్
జగిత్యాల జిల్లా మెడిపెల్లి మండలం కట్లకుంట(Katlakunta) గ్రామంలోని మాల సంఘ భవనంలో అర్థరాత్రి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్సై శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.8,740 నగదును సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సంఘ భవనాలు, గణేష్ విగ్రహాల ఏర్పాటు ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో పేకాటతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కొనసాగుతుందని తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
