జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు(Kalvakuntla Vidyasagar Rao) కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీసమేతంగా గణేష్ మండపానికి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుని కృపతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని గణేశుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
