Homeమెదక్‌​Sadashivpet | శ్రీ చెన్నబసవేశ్వర మందిరంలో ఘనంగా ముగింపు మహోత్సవాలు

​Sadashivpet | శ్రీ చెన్నబసవేశ్వర మందిరంలో ఘనంగా ముగింపు మహోత్సవాలు

  • రేపు శాస్త్రోక్తంగా సామూహిక అభిషేక పూజలు, మహా అన్నప్రసాదం
  • ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో కమిటీ విశేష కృషి
  • భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని శ్రీ చెన్నబసవేశ్వర కమిటీ సభ్యుల పిలుపు

సదాశివపేట పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చెన్నబసవేశ్వర మందిరంలో వినాయక నవరాత్రులు మరియు పవిత్ర శ్రావణమాస మండల అభిషేక ముగింపు సందర్భంగా విశేష పూజా మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ చెన్నబసవేశ్వర ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి సంయుక్తంగా ప్రకటించారు. ఆలయ అభివృద్ధిలో నిరంతరం సేవాభావంతో ముందంజలో ఉంటూ, ధార్మిక సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ విశేష కృషి చేస్తున్న శ్రీ చెన్నబసవేశ్వర కమిటీ సభ్యులు ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.Sadashivpet

​ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ… ఆదివారం (సెప్టెంబర్ 20) ఉదయం 10:00 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇందులో భాగంగా మంగళవాయిద్యాలతో మహా కలశాల ఊరేగింపు, భక్తుల సమక్షంలో సామూహిక మహాన్యాసపూర్వక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా జరుగుతాయని వివరించారు. పూజాదికాల అనంతరం విచ్చేసిన భక్తులందరికీ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ ఘనంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

​ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందిస్తున్న శ్రీ చెన్నబసవేశ్వర కమిటీ సభ్యులు… ఈ దివ్య మహోత్సవానికి పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు, శివభక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, సామూహిక అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి పరమశివుని దివ్య కృపాకటాక్షాలు పొందాలని సహృదయంతో కోరారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News