Homeవరంగల్‌Venkatapuram | ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం..

Venkatapuram | ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం..

వెంకటాపురం మండలం లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రామేళ్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచారు. మన ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బిజెపి కార్యకర్తలు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నందు నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని వారి పేరు మీద అర్చన చేయించారు.

అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్, పండ్లని పంచారు. తదుపరి బర్త్డే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామెల్ల రాజశేఖర్, మండల సీనియర్ నాయకులు ఉప్పల కృష్ణమూర్తి , జల్లిగంపల లక్ష్మీపతి, జిల్లా కౌన్సిల్ మెంబర్ సునీల్, మండల ప్రధాన కార్యదర్శి నోముల శ్రీకిషన్, కోయిల శ్రీను, అంకాల దుర్గ, బీజేవైఎం ప్రెసిడెంట్ ముడుంబా లోకేష్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

Venkatapuram

- Advertisement -
RELATED ARTICLES

Latest News