- తాడ్వాయి అంబేద్కర్ సంఘం నాయకులు.
కల్పిత నాయకుడు, పుస్తక రచయిత, అమర ప్రసాద్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని తాడ్వాయి మండల(Tadwai Mandal) అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం తాడ్వాయి మండల కేంద్రంలో 30 మంది అంబేద్కర్ సంఘం నాయకులు(Ambedkar Association Leaders) తాడ్వాయి పోలీస్ స్టేషన్లో హమారా ప్రసాద్(Hamara Prasad) పై లిఖితపూర్వక ఫిర్యాదు(Complaint) చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ, ఆనాడు గాంధీని గాడ్సే కాల్చి చంపినట్లే, నేడు అంబేద్కర్ బతికి ఉంటే నేనే కాల్చి చంపేవాడినని హమారా ప్రసాద్ అనడం అత్యంత దురదృష్టకరమన్నారు.

ఇలా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమర ప్రసాద్ ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జిల్లా సంఘం నాయకులు లీడర్ రవీందర్,తాడ్వాయి మండలం అంబేద్కర్ సంఘం నాయకులు, సంతోష్, నర్సింలు, లింగం, సాయన్న,స్వామి, రాజశేఖర్, రాము,గంగారం, పౌరాజ్, ప్రభాకర్, నరేష్, బాలరాజ్, అంబేద్కర్ సంఘం యూత్ అధ్యక్షులు రంజిత్, రాజశేఖర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
