Homeహైదరాబాద్‌Birudula Praveen Kumar | అంబేద్కర్ను అవమానించిన హమారా ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి

Birudula Praveen Kumar | అంబేద్కర్ను అవమానించిన హమారా ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి

  • మాదిగ జాగృతి దండోరా వ్యవస్థాపకుడు రాష్ట్ర అధ్యక్షుడు బిరుదుల ప్రవీణ్ కుమార్

రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ అంబేడ్కర్(Babasaheb Ambedkar) పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న హైదరాబాద్ వ్యక్తి నాగులారపు అలియాస్ హమారా ప్రసాద్(Harama Prasad) పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేసు నమోదు చేయాలని మాదిగ జాగృతి దండోరా(Madiga Jagruthi Dandora) వ్యవస్థాపకుడు,రాష్ట్ర అధ్యక్షుడు బిరుదుల ప్రవీణ్ కుమార్(Birudula Praveen Kumar) డిమాండ్ చేశారు.

రాజ్యాంగ నిర్మాతను అవమాన పరుస్తున్నా,అంబేద్కర్ పై అవాకులు మాట్లాడుతున్న వారు మనువాదులు వదిలే మెతుకులకు ఆశపడుతున్న కిరాయి మనుషులేనని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా రేవంత్ రెడ్డి తన బాధ్యతలను పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులనుభవిస్తున్న వారు రాజ్యాంగ నిర్మాతలకు అవమానం జరుగుతుంటే మౌనమెట్ల వహిస్తారని వారు ప్రశ్నించారు.

- Advertisement -

జరుగుతున్న అవమానం అంబేద్కర్ కు కాదని దేశంలోని మెజార్టీ వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీలను మనువాదులు అవమానిస్తున్నారని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అవాస్తవ, అవమానకర వ్యాఖ్యలు చేస్తూ పుస్తకాలు రచించిన హమారా ప్రసాద్ను(Harama Prasad) వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో దివంగత నేతలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని వారు పేర్కొన్నారు.

ఈ నిందితున్ని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో పునరుక్తం కాకుండా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ ప్రకటన కార్యక్రమంలో మాదిగ జాగృతి దండోరా రాష్ట్ర ఉపాధ్యకులు చిలుక ఆనంద్, మంగలి రాము లు, రాష్ట్ర నాయకులు సాయి బాబా, హరి,ప్రశాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News