మహానగరంలో మనిషి అత్యవసరాలను తీర్చాల్సిన పవిత్ర స్థలాలు.. అక్రమార్కుల దాహార్తికి కాసుల వర్షం కురిపించే వ్యాపార కేంద్రాలుగా మారడం అక్షరాలా ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన దుస్థితి. ప్రభుత్వ ధనంతో, ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ‘లూకేఫ్’ ప్రాజెక్టులు నేడు పర్యవేక్షణ లోపంతో, అధికారుల లాలూచీతో నిరుపయోగంగా మారిపోయాయి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా దిక్కులేని దయనీయ స్థితిలో సామాన్యుడిని నెట్టేస్తూ, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఈ లూటీపై పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, కఠిన చర్యలు తీసుకోవాలి.. లేకపోతే పరిశుభ్రమైన భాగ్యనగరం కాస్తా అవినీతి మురుగులో కూరుకుపోవడం ఖాయం.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
- Advertisement -
