- సి ఎస్ ఆర్ నిధులతో రెండు ప్రభుత్వ పాఠశాలలు..
- నెల్లూరులో ప్రారంభించిన మంత్రి నారా లోకేష్..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా నెల్లూరు నగరంలో మరో ముందడుగు పడింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో(CSR Funds) అత్యంత ఆధునికంగా అభివృద్ధి చేసిన రెండు ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన నెల్లూరు చేరుకోగా, మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా పలువురు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ముందుగా నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన వీపీఆర్ ఫౌండేషన్ అందించిన రూ.8.3 కోట్ల ఆర్థిక సహకారంతో సమూలంగా ఆధునికీకరించిన ఆర్.ఎస్.ఆర్. మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నూతన భవనాలను మంత్రి లోకేశ్(Nara Lokesh) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగి విద్యార్థులతో ముచ్చటించారు. తరగతి గదులు, ప్రయోగశాలలు, డైనింగ్ హాల్‌ను పరిశీలించి, మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
