Homeఆదాబ్ ప్రత్యేకంNice Construction | అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ నైస్ కన్స్ స్ట్రక్షన్..

Nice Construction | అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ నైస్ కన్స్ స్ట్రక్షన్..

  • ఆంధ్రా నుండి వచ్చి తెలంగాణలో కబ్జాలు చేస్తున్న వైనం..
  • సుప్రీం కోర్టు ఆర్డర్ ఉంటే నాకేంటి అంటున్న రాజారావు..
  • వక్ర మార్గంలో నిర్మాణ అనుమతులు పొందిన అక్రమార్కుడు..
  • కాసులకు కక్కుర్తి పడి అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్న మున్సిపల్ అధికారులు..
  • పిర్యాదు ఇచ్చిన పట్టింపు లేని మేడ్చల్ మున్సిపల్ కమిషనర్..
  • కబ్జాదారుల పై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..
  • మున్సిపల్ శాఖలోని అవినీతి అధికారులపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టాలి..
  • ల్యాండ్ గ్రాబర్స్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి..
  • విచారించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న భూ యజమాని అమరేందర్ రెడ్డి..

చట్టాలు, న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు.. ఇవేవీ తనను ఏమి చేయలేవన్నట్లుగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అమ్ముగూడలో ఓ కబ్జాకోరు చెలరేగిపోతున్నాడు. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో అక్రమాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తున్న వైనం ఇపుడు తీవ్ర కలకలం రేపుతోంది.

అక్రమ మార్గంలో నిర్మాణ అనుమతులు పొంది అమాయకుల భూములను కొల్లగొడుతున్నాడు. ఇదంతా జరుగుతున్నా.. కాసులకు కక్కుర్తిపడిన కొందరు మున్సిపల్ అధికారులు ఈ అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. బాధితుడు స్వయంగా ఫిర్యాదు చేసినా, మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ ఏమాత్రం పట్టించుకోక పోవడం వెనుక ఉన్న లాలూచీ ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వినపడుతున్నాయి..

- Advertisement -

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, మల్కాజ్ గిరి మండలం, అమ్ముగూడ గ్రామ శివారులో సర్వే నెంబర్ 5, 6, 7,10/1,11/1,12/1,12/42 లో 11 ఎకరాల 03 గుంటల స్థలం, సర్వే నెంబర్ 13, 14 లలో 31 ఎకరం 13 గుంటల స్థలం తనకు చెందిన భూమి ఉందని భూ యజమాని అమరేందర్ రెడ్డి తెలిపారు.. కాగా తన యొక్క భూమిలో కొంతమంది కబ్జాకోర్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలు చేస్తుంటే కోర్టును ఆశ్రయించారు సదరు భూ యజమాని అమరేందర్ రెడ్డి.. ఇతనికి సుప్రీం కోర్టు నుండి అనుకూలంగా, ల్యాండ్ గ్రాబర్స్‌కి వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లు తెలిపారు..

ఇదంతా తెలిసినా నైస్ కన్ స్ట్రక్షన్(Nice Construction) యజమాని రాజారావు నైస్ గా కబ్జాలు(Encroachment) చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. సుప్రీం కోర్టులో కేసు ఓడిపోయిన వ్యక్తులతో ములాఖాత్ అయి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలకు తెరలేపారు రాజారావు(Raja Rao).. దర్జాగా కబ్జాలు చేస్తుండటం ఇతనికి వెన్నెతో పెట్టిన విద్యగా మారిపోయింది.

Ammuguda Illegal Construction Allegations2

మున్సిపల్ అధికారులను మేనేజ్ చేయడం, అక్రమాలకు పాల్ప డటం ఇతనికి పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు బాధితుడు.. సుప్రీం కోర్టు తీర్పు ఉంటే నాకేంటి అని చెప్పుకుం టూనే కబ్జాలకు పాల్పడుతున్న రాజారావు(Raja Rao).. యదేచ్ఛగా నిర్మాణం చేయడం మున్సిపల్ అధికారుల అవినీతికి అద్దం పడుతుంది.. కాసులకు కక్కుర్తి పడి ఫేక్ డాక్యుమెంట్లకు వక్ర మార్గంలో నిర్మాణ అనుమతులు ఇవ్వడం ఏంటని ఆరోపిస్తున్నారు భూ యజ మాని.. అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌గా మారిన నైస్ కన్ స్ట్రక్షన్(Nice Construction) యజమాని రాజారావు కబ్జాల పర్వం రోజు రోజుకు పెరిగిపో తుందని అన్నారు..

వాస్తవాలు ఆధారాలతో పిర్యాదు చేసినా అక్రమ నిర్మాణాలపై నేటికి మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్ట డం లేదంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.. కబ్జాదారు లకు పరోక్ష సహకారం అందిస్తూ.. మేడ్చల్ మున్సిపల్ కార్పొరే షన్‌లోని కాప్రా మున్సిపాల్టీ అధికారులు అవినీతికి పాల్పడి అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారని ఆరోపించారు.. ఏసీబీ, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి ఫేక్ డాక్యుమెంట్లకు పరిమిషన్ ఇస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..

ల్యాండ్ గ్రాబర్ రాజారావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని.. భూ కబ్జాలకు పాల్పడకుండా పోలీస్ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు.. ఇప్పటికైనా రాజారావు కబ్జాలను కట్టడి చేస్తారా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. అక్రమంగా ఇచ్చిన నిర్మాణ అను మతులను తక్షణమే రద్దు చేయాలి.. అనుమతులు ఇచ్చిన అధికా రులను విధుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు..

ఇంత ఓపెన్‌గా కబ్జా చేయడం వెనుక శ్రీని వాస్ రెడ్డి అనే వ్యక్తి హస్తం సైతం ఉన్నట్లు ఆయన ఆరోపిం చారు.. అమ్ముగూడ కేంద్రంగా కబ్జా దారులు చేస్తున్న అరాచ కాలు, సృష్టించిన బోగస్ పత్రాలు, అడ్డదారిలో చేసుకున్న రిజిస్ట్రే షన్లకు సంబంధించి మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

‘ఆదాబ్ హైదరాబాద’.. ‘మా అక్షరం అవినీతిపై అస్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News