- నేరేడ్మెట్లో ముగ్గురి అరెస్ట్.. చోరీ సొత్తు స్వాధీనం
మల్కాజ్‌గిరిలోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్(Neredmet Police Station) పరిధిలో మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారైన ఘటనలో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సెప్టెంబర్ పన్నెండో తేదీన శివనగర్ కాలనీలో ఈ చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై నేరేడ్మెట్ పోలీసులు(Neredmet Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య(Inspector Venkataiah) ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎస్ఐ సాయి అవినాష్ , ఎస్ఐ పుల్లారెడ్డి, నేరేడ్మెట్ నేర పరిశోధన బృందం, సైబర్ నేర పరిశోధన బృందం సమన్వయంతో దర్యాప్తు చేపట్టారు.
ఘటనకు సంబంధించిన పరిసర ప్రాంతాల సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుల ఆచూకీని గుర్తించారు. సెప్టెంబర్ పదిహేనో తేదీన రిహాన్ అహ్మద్, మహమ్మద్ సోను, ఆసిఫ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులు ఎల్బీనగర్లో నివాసం ఉంటూ ఎంబ్రాయిడరీ పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విలాసాలకు అలవాటు పడటంతో తమ సంపాదన సరిపోక చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు మల్కాజ్గిరి ఏసీపీ యాదగిరి తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
