HomeజాతీయంStrike | నిలిచిపోయిన బ్యాంకింగ్ సేవలు..

Strike | నిలిచిపోయిన బ్యాంకింగ్ సేవలు..

  • దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడ్డ కస్టమర్లు..
  • బ్యాంకు యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మె..

దేశ‌వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవ‌లు నిలిచిపోయాయి(Bank Employees Strike). దీంతో కోట్లాది మంది క‌స్ట‌మ‌ర్లు ఇబ్బందిప‌డుతున్నారు. యునైటెడ్ ఫోర‌మ్ ఆఫ్ బ్యాంక్ యూనియ‌న్ల ఆధ్వ‌ర్య‌లో బ్యాంకు ఉద్యోగుల స‌మ్మె కొన‌సాగుతోంది. వారానికి 5 రోజుల‌ ప‌నిదినాల విధానాన్ని అమ‌లు చేయాల‌ని కోరుతూ బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు ఆందోళ‌న చేస్తున్నారు. బ్రాంచ్ ఆప‌రేష‌న్స్‌, క్యాష్ డిపాజిట్స్‌, విత్ర‌డాల్స్‌, చెక్కు క్లియ‌రెన్సులు నిలిచిపోయాయి. ఉద్యోగుల‌తో పాటు ఆఫీస‌ర్లు కూడా ఈ స‌మ్మెలో పాల్గొంటున్నారు.

చాలా వ‌ర‌కు ప‌బ్లిక్ రంగ బ్యాంకుల‌ను మూసివేశారు. యూఎఫ్‌బీయూ గ్రూపులో మొత్తం 9 ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఇక పబ్లిక్ రంగ బ్యాంకుల్లో సుమారు 8 ల‌క్ష‌ల మంది వ‌ర్క‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.. బ్యాంకుల మూసివేత‌తో ఎక్క‌డిక్క‌డ చెక్కులు నిలిచిపోయాయి. సుమారు 4 ల‌క్ష‌ల కోట్ల మేర విలువైన చెక్కుల‌ను పెండింగ్‌లో పెట్టిన‌ట్లు తెలుస్తోంది. క్యాష్ ట్రాన్జాక్ష‌న్స్‌, బిల్ ట్రేడింగ్‌, బిల్ డిస్కౌంట్ , ట్రేడ అంశాల్లో లావాదేవీలు స్తంభించాయి.(https://epaper.aadabhyderabad.in/)

- Advertisement -

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీహెచ్ వెంక‌టాచ‌లం మాట్లాడుతూ అన్ని ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోని ట్రెజ‌రీ ఆప‌రేష‌న్స్ నిలిపివేసిన‌ట్లు చెప్పారు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఏటీఎంల్లో న‌గ‌దు నిండుకున్న‌ది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీ, యాక్సిస్ లాంటి బ్యాంకుల్లో ఇవాళ సేవ‌లు కొన‌సాగాయి. ఆ బ్యాంకుల‌ ఉద్యోగులు ఏ సంఘంలో లేరు. డిజిట‌ల్ బ్యాంకింగ్ స‌ర్వీసులు, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, యూపీఐలు అభ్యంత‌రం లేకుండా ప‌నిచేస్తున్నాయి.

నెల‌లో ప్ర‌తి శ‌నివారం కూడా హాలీడే ఇవ్వాల‌ని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ప‌ని స‌మ‌యాన్ని అద‌నంగా 40 నిమిషాలు పెంచాల‌ని, ప్ర‌తి శ‌నివారాన్ని హాలీడేగా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ 2023 డిసెంబ‌ర్‌లో అధికారుల‌కు అభ్య‌ర్థ‌న స‌మ‌ర్పించిన‌ట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీస‌ర్స్ కాన్ఫిడ‌రేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ రూప‌మ్ రాయ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News