- కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ
గణేష్ నవరాత్రి(Ganesh Navaratri,) ఉత్సవాల నేపథ్యంలో రౌడీ షీటర్లు(Rowdy-Sheeters), ట్రబుల్ మంగర్స్కు కౌన్సెలింగ్(Counseling) రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు మరియు ట్రబుల్ మంగర్స్కు కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కోరుట్ల సీఐ కే. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాల సమయంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని సూచించారు. ఎలాంటి గొడవలు, నేరాలకు పాల్పడినా లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.(epaper.aadabhyderabad.in)

గణేష్ ఉత్సవాలు మరియు ఊరేగింపులు ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని, ప్రజలతో సమన్వయంతో వ్యవహరించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ కోరుట్ల కే. లక్ష్మీనారాయణ, ఎస్ఐ జి. శ్యామ్ రాజ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
