Homeనిజామాబాద్‌Tributes | భూస్వాముల గుండెల్లో గుబులు పుట్టించిన ధీరవలిత చాకలి ఐలమ్మ.

Tributes | భూస్వాముల గుండెల్లో గుబులు పుట్టించిన ధీరవలిత చాకలి ఐలమ్మ.

  • రోకలి బండ చేతబట్టి రజాకార్లను తరిమికొట్టిన.. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ..
  • తరతరాలకు తరగని స్ఫూర్తి ఐలమ్మ – ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి. తాడ్వాయి మండల రజక సంఘం సభ్యులు.

పంట కూసేదెవడు, గింజ ముట్టే దెవుడు,అంటూ రోకలిబండ చేతబట్టుకొని భూస్వాములకు ఎదురు తిరిగి భూసాముల కోటపై తిరుగుబాటు జెండా పతాక ఆవిష్కరణ చేసిన తెలంగాణ బిడ్డ చాకలి ఐలమ్మ(Chakali Ailamma) అని తాడ్వాయి మండల రజక సంఘం సభ్యులు అన్నారు(Tributes). గురువారం తాడ్వాయి మండలంలోని కనకల్ దేమే, తాడ్వాయి,ఏండ్రి యల్,ఎర్రపహాడ్, కృష్ణాజివాడి తాడ్వాయి,గ్రామాల్లో గురువారం చాకలి ఐలమ్మ(Ailamma) వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహాలకు,చిత్రపటాలకు పూలదండలు వేసి వీరనారికి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కన్కాల్ ఉపసర్పంచ్ మహేందర్ మాట్లాడుతూ వరంగల్, జిల్లా రాయపర్తి మండలం, కిష్టాపూర్ గ్రామంలో జన్మించిన ఐలమ్మ ఆనాడు రజాకార్ల పాలనకు, భూస్వాముల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి, అణగారిన వర్గాలకు ఆదర్శంగా నిలిచిన వీర వనిత ఐలమ్మ(Ailamma) అని ఆయన అన్నారు. తరతరాలుగా తరగతి స్ఫూర్తి, ఐలమ్మ జీవితమే మనకు స్ఫూర్తిగా,ఆమెని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, రజక సంఘం పెద్దలు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News