HomeసినిమాMandaadi | చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ నేడే గ్రాండ్ రిలీజ్

Mandaadi | చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ నేడే గ్రాండ్ రిలీజ్

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’.(Mandaadi) ఈ సినిమాని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని ఈ రోజే (సెప్టెంబర్ 10) భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున విడుదల చేయనుంది. ఇక ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ అన్నీ కూడా సినిమా మీద హైప్‌ను పెంచేశాయి. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ అయితే అందరినీలో సినిమాని చూడాలన్న ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది.(epaper.aadabhyderabad.in)

తాజాగా ఈ మూవీకి సెన్సార్ పూర్తయింది. ‘మండాడి’(Mandaadi) సినిమాకి యూ/ఎ సర్టిఫికెట్ లభించింది. మూవీ అద్భుతంగా వచ్చిందని, బోట్ సీక్వెన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయని సెన్సార్ టీం అభినందించింది. ‘మండాడి’ సినిమాకి కథిర్ అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా కానున్నాయి.

- Advertisement -

తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో ఈ సినిమాని నేడు గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే బుక్ మై షోలో గంటకు వందల, వేల టికెట్లు తెగుతున్నాయి. సుహాస్, సూరి కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చే చిత్రంగా ‘మండాడి’((Mandaadi)) నిలవనుంది.

*నటీనటులు* : సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు

*సాంకేతిక బృందం*

బ్యానర్ : ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్
సమర్ఫణ : ఎల్రెడ్ కుమార్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వెట్రిమారన్
నిర్మాత : ఎల్రెడ్ కుమార్
సహ నిర్మాత : మణికందన్
దర్శకుడు : మతిమారన్ పుగళేంది
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
కెమెరామెన్ : ఎస్.ఆర్. కథిర్
ఎడిటింగ్ : ప్రదీప్ ఇ. రాఘవ్
యాక్షన్ : పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ
ప్రొడక్షన్ డిజైన్‌ : డి.ఆర్.కె. కిరణ్
పీఆర్వో : సాయి సతీష్

- Advertisement -
RELATED ARTICLES

Latest News