- ఊరుకొండకు రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు
- ఉత్తమ ఎంఈఓగా అబ్దుల్ రహీమ్
- ఉత్తమ ఉపాధ్యాయుడిగా దన్నె పర్వతాలు
విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉత్తమ ఉపాధ్యాయులను(Best Teacher) జిల్లా విద్యాశాఖ ఘనంగా సత్కరించింది(Honour). జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు.జిల్లా వ్యాప్తంగా విద్యా రంగంలో ప్రతిభ కనబరిచిన సుమారు 80 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఎంపిక చేసి ఘనంగా సన్మానించి పురస్కారాలు అందజేశారు.
విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు,పాఠశాలల అభివృద్ధి,ఉత్తమ ఫలితాల సాధనతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డులను(Award) ప్రదానం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని,సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం ద్వారా మరింత మంది స్ఫూర్తి పొందుతారని అన్నారు.

ఊరుకొండకు రెండు అవార్డులు(Honour)
జిల్లా స్థాయిలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఊరుకొండ మండలానికి(Urkonda Mandal) రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి.ఊరుకొండ మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ రహీమ్ ఉత్తమ ఎంఈఓగా ఎంపికై పురస్కారం అందుకున్నారు.అదేవిధంగా ఊరుకొండ ఎంపీహెచ్‌ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు దన్నె పర్వతాలు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అవార్డు అందుకున్నారు.
జిల్లా స్థాయిలో తమ సేవలకు గుర్తింపు లభించడంపై ఇరువురిని ఉపాధ్యాయులు,సహచరులు,విద్యాశాఖ అధికారులు అభినందించారు.ఈ కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ సిబ్బంది,జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు,అవార్డు గ్రహీతలు,వారి కుటుంబ సభ్యులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
