Homeరంగారెడ్డిDetained | కడ్తాల్‌ పోలీసుల అదుపులో ఆశా వర్కర్లు

Detained | కడ్తాల్‌ పోలీసుల అదుపులో ఆశా వర్కర్లు

  • చలో హైదరాబాద్‌కు బయలుదేరిన ఆశా వర్కర్ల అరెస్ట్
  • అధ్యక్షురాలు జ్యోతి,సబిత,లావణ్యలను ఇంటి వద్దే అరెస్ట్ చేసిన పోలీసులు

తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి తరలివెళ్లేందుకు సిద్ధమైన ఆశా వర్కర్లను(ASHA workers) పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు(Detained). మంగళవారం ఉదయం చలో హైదరాబాద్‌(Chalo Hyderabad) కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల(Kadthal Mandal) ఆశా వర్కర్ల అధ్యక్షురాలు జ్యోతి, సబిత,లావణ్యలను ఉదయం 6గంటలకు పోలీసులు వారి ఇళ్ల నుంచి అదుపులోకి తీసుకున్నట్లు ఆశా వర్కర్లు తెలిపారు. ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో కడ్తాల్‌ మండలానికి చెందిన ఆశా వర్కర్లు హైదరాబాద్‌కు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

రూ.18 వేల కనీస వేతనం,ఉద్యోగ భద్రత కల్పించడం,ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ పెండింగ్‌ బిల్లులు,పెండింగ్‌ వేతనాలు చెల్లించడం,ఎన్‌సీడీ ఆన్‌లైన్‌ పనులు–ఫ్లూట్‌ డబ్బుల పేరుతో అదనపు భారాన్ని మోపకపోవడం,ఏఎన్‌సీ,పీఎన్‌సీ తదితర విధులకు తగిన పారితోషికం చెల్లించడం వంటి పలు డిమాండ్లను ఆశా వర్కర్లు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు.

- Advertisement -

అలాగే ఆదివారం, పండుగ రోజుల్లో నిర్వహించే విధులకు అదనపు పారితోషికం, 20 క్వార్జ్‌బుల్‌ సెలవులు, 6 నెలల వేతనంతో కూడిన మెడికల్‌ సెలవులు, రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌, రూ.50 వేల బట్టి ఖర్చులు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, ఏఎన్‌ఎం–జీఎన్‌ఎం పోస్టుల్లో ఆశా వర్కర్లకు ప్రాధాన్యత వంటి డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా హైదరాబాద్‌కు తరలివెళ్తున్న తమను ముందస్తుగా అరెస్ట్‌ చేయడం సరికాదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News