Homeఆదాబ్ ప్రత్యేకంGlobal Kabaddi | కబడ్డీకి గ్లోబల్ టచ్

Global Kabaddi | కబడ్డీకి గ్లోబల్ టచ్

  • 66 దేశాల సమీకరణకు కసరత్తు.. 40 దేశాల ప్రతినిధులతో భేటీ (Global Kabaddi)
  • ప్రపంచ కబడ్డీ అభివృద్ధిపై కీలక చర్చలు (Global Kabaddi)
  • ఓలంపిక్ క్రీడగా చేర్చేందుకు కృషి (Global Kabaddi)
  • 2026–27 అభివృద్ధి కార్యాచరణపై చర్చ (Global Kabaddi)
  • ప్రపంచస్థాయిలో క్రీడాకారులకు అవకాశాలు (Global Kabaddi)
  • అంతర్జాతీయ విస్తరణకు జ్ఞానేశ్వర్ కీలక కృషి

(Global Kabaddi) కాసాని జ్ఞానేశ్వర్ నిబద్దత కలిగిన రాజకీయవేత్తగానే మనకు తెలుసు.. సామాజిక సంస్కరణలు, క్రీడాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి చాలామందికి తెలియదు.. రాజకీయాలు ఎంత స్వచ్ఛంగా చేయగలడో.. అంతకంటే ఎక్కువుగా సంస్కరణలను తన భుజస్కందాలపై వేసుకుని ముందుకు సాగడం ఆయన నైజం.. కబడ్డీ క్రీడను విశ్వవ్యాప్తం చేయడం కోసం ఆయన అహర్నిశలు కృషిచేస్తున్నారు.. గ్లోబల్.. ఒలింపిక్ వేదిక వైపు కబడ్డీని తీసుకువెళ్ళడానికి ఆయన ఒక లక్ష్యం ఏర్పరచుకుని ముందుకు సాగుతున్నారు.. హైదరాబాద్ నగరంలోని హోటల్ గ్రాండ్ కాసాని వేదికగా జరిగిన సమావేశం ఒక అద్వితీయమైన కార్యక్రమానికి అంకురార్పణగా నిలిచింది.. శరీర దారుడ్యంతో పాటు మానసిక స్తైర్యాన్ని పెంచే కబడ్డీ క్రీడను యువత జీవితంలో ఒక భాగంగా చేయగలిగితే ఎంతో శక్తివంతంగా మారుతుందని నమ్మిన ఆయన తన వంతు కృషిని సల్పుతున్నారు..


ప్రపంచ కబడ్డీ భవిష్యత్తుపై భాగ్యనగరం మరోసారి తన ముద్ర వేసింది. నగరంలోని హోటల్ గ్రాండ్ కసాని వేదికగా ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ అత్యంత ప్రతిష్టాత్మక జనరల్ బాడీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలను ఘనంగా నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి కబడ్డీ భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించడం ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా నిలిచింది.. కబడ్డీని ప్రపంచ మూలమూలలకూ తీసుకెళ్తూ, ఏకంగా 66 దేశాలను ఐ.కే.ఎఫ్. ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా భారీ ప్రణాళిక రూపొందించారు. మైదానంలో కూతకే పరిమితం కాకుండా, కబడ్డీని ఒలింపిక్ వేదికపై అధికారిక క్రీడగా నిలబెట్టడమే పరమావధిగా అడుగులు వేస్తున్నారు. క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంతో పాటు, కోచ్‌లు, అంపైర్లు, సాంకేతిక అధికారుల ప్రమాణాలను గ్లోబల్ స్థాయికి పెంచేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయ ప్రాంతీయ క్రీడగా మొదలైన కబడ్డీని, విశ్వక్రీడగా తీర్చిదిద్దే ఈ చారిత్రాత్మక ప్రయాణంలో హైదరాబాద్ వ్యూహాత్మక వేదికగా నిలవడం విశేషం.

- Advertisement -
Global Kabaddi Expansion Meeting

కబడ్డీ కోసం కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అంకితభావం :(
ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ డైరెక్టర్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కబడ్డీ అభివృద్ధి, అంతర్జాతీయ విస్తరణ కోసం కీలకంగా కృషి చేస్తున్నారు. కాసాని జ్ఞానేశ్వర్‌కు కబడ్డీ కేవలం ఒక క్రీడ కాదు.. అది ప్యాషన్.. అంకితభావం.. ఒక విజన్. ప్రపంచవ్యాప్తంగా కబడ్డీకి మరింత గుర్తింపు తీసుకురావడం, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ కబడ్డీకి బలమైన గుర్తింపు కల్పించడం, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడం, వివిధ దేశాల కబడ్డీ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఆయన లక్ష్యాల్లో ప్రధానమైనవి. కబడ్డీని భౌగోళిక సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించి.. బలమైన అంతర్జాతీయ క్రీడగా తీర్చిదిద్దాలన్నదే ఆయన విజన్.

ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ నాయకత్వంలో:(

  • కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ – డైరెక్టర్, ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్,
  • వెంకటేష్ బండారి – డైరెక్టర్, ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్,
  • గోవింద్ నారాయణ్ శర్మ – డైరెక్టర్, ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్.

40కి పైగా దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావడం.. కబడ్డీకి పెరుగుతున్న అంతర్జాతీయ ఆదరణకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడను మరింత బలోపేతం చేసే ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

International Kabaddi

ప్రపంచవ్యాప్తంగా కబడ్డీ బలోపేతమే లక్ష్యం :(Global Kabaddi)
ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐ.కే.ఎఫ్. ప్రెసిడెంట్ వినోద్ తివారి, ఐ.కే.ఎఫ్. డైరెక్టర్ తేజస్వి గెలాట్‌లను వారి పదవుల నుంచి తొలగించినట్లు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో కొత్త ఐ.కే.ఎఫ్. డైరెక్టర్ల నియామకం, కొత్త దేశాలను ఐ.కే.ఎఫ్. సభ్యత్వంలోకి తీసుకురావడం, 2026 – 27 సంవత్సరానికి సంబంధించిన కబడ్డీ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కబడ్డీని మరింత విస్తరించడం, 66 దేశాలను అంతర్జాతీయ కబడ్డీ వేదికపైకి తీసుకురావడం, క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించడం, కబడ్డీని మరింత బలమైన అంతర్జాతీయ క్రీడగా తీర్చిదిద్దడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.

కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, మరిన్ని దేశాలకు విస్తరించడం, అంతర్జాతీయ స్థాయిలో క్రీడకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ఐ.కే.ఎఫ్. ప్రధాన లక్ష్యాల్లో భాగం. వివిధ దేశాల కబడ్డీ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకురావడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం, క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించడం, కబడ్డీ అభివృద్ధికి కొత్త వ్యూహాలను రూపొందించడం వంటి అంశాలపై హైదరాబాద్ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. 66 దేశాలను కబడ్డీ అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో కబడ్డీని మరింత విస్తృత స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఐ.కే.ఎఫ్. ముందుకు సాగుతోంది.

మూడు ప్రధాన లక్ష్యాల‌తో ముందుకు :
కబడ్డీపై ప్యాషన్.. కబడ్డీ అభివృద్ధిపై అంకితభావం.. కబడ్డీని ప్రపంచానికి చేర్చాలనే విజన్.. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఐ.కే.ఎఫ్. అంతర్జాతీయ సమావేశం.. ప్రపంచ కబడ్డీని మరింత బలోపేతం చేయడం, అంతర్జాతీయ గుర్తింపును పెంచడం, మరిన్ని దేశాలను కబడ్డీ కుటుంబంలోకి తీసుకురావడం, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడం, కబడ్డీని ఒలింపిక్ వేదికకు మరింత చేరువ చేయడం వంటి లక్ష్యాల దిశగా కీలక అడుగుగా నిలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News