- శక్తి స్కీం ను కూడా ఉపసంహరించుకోవాలి ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్
జీఓ నెంబర్ 97ను రద్దు చేయాలని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి బాషిపంగు సునీల్ డిమాండ్ చేశారు. గురువారం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని, శక్తి స్కీం ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా భాషిపంగు సునీల్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయాల వల్ల విద్యార్థులు, ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న జీఓ నంబర్ 97ను రద్దు చేయడంతో పాటు శక్తి స్కీం ను కూడా ఉపసంహరించుకోవాలని అన్నారు.
ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, సంబంధిత వర్గాలతో చర్చించి తక్షణమే ఈ రెండు జీఓలపై పునఃసమీక్ష చేయాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో విద్యార్థుల హాసిని, శృతి, కావ్య, శ్వేత, రాజు, సోనీ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
