- అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు….
- ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య
ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతీ ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు(Indiramma Illu) మంజూరు చేస్తామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యలు అన్నారు. గురువారం సూర్యాపేట మండలంలోని రామచంద్రపురం, రాజునాయక్ తండా గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి కలిసి వీర్ల మౌనిక- రామచంద్రా రెడ్డి గారు, భూపతి ఉపేంద్ర – సైదులు, భూక్యా దేవి-వెంకన్న ల ఇందిరమ్మ ఇల్లుల గృహప్రవేశం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నూతన గృహంలో గృహప్రవేశం చేస్తున్న కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంటిలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మొరిశెట్టి లక్ష్యాధి, మండల ఇంచార్జ్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, సర్పంచ్ గోడదాటి కావ్య సతీష్, ఉప సర్పంచ్ లింగయ్య, మాజీ సర్పంచులు మాలి కవిత అనంత రెడ్డి, మండల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి, బొడ్డు మల్లయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతల అంజయ్య, మాజీ ఎంపిటిసి బండి ప్రభాకర్ రెడ్డి, నాయకులు నల్లగంటి నర్సయ్య, కొప్పుల లక్ష్మారెడ్డి, చివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు దారావత్ వీరన్న నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ చిలుముల సునీల్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుగులోతు నాగు నాయక్, పడిదల రవి, గుంటూరు చిట్టిబాబు, దుబ్బాక ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
