Homeనిజామాబాద్‌Accident | తాడ్వాయి లో రెండు బైకులు డి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు.

Accident | తాడ్వాయి లో రెండు బైకులు డి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు.

తాడ్వాయి మండల(Tadwai Mandal) కేంద్రంలోని గురుకుల పాఠశాల సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు(Severe Injuries). స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల సమీపంలో తాడ్వాయి గురుకుల పాఠశాల వైపు వెళ్తున్న వాహనదారుడు, చందాపూర్ నుంచి తాడ్వాయి వైపు వస్తున్న మరో వాహనదారుడు, ప్రమాదవశాత్తో ఎదురెదురుగా ఒకరిని ఒకరు ఢీకొన్నారు.

ఈ ప్రమాదంలో తాడ్వాయికి చెందిన లింగవ్వొల్ల జీవన్, మరొకరు మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామానికి చెందిన దేవుపల్లి శ్రావణ్ కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరినీ కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

ప్రస్తుతం ఇద్దరికీ చికిత్స కొనసాగుతోంది. ఇదిలా ఉండగా శ్రావణ్ చందాపూర్ నుంచి తాడ్వాయి వస్తుండగా, జీవన్ తాడ్వాయి నుంచి హాస్టల్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. శ్రావణ్ వ్యవసాయం చేస్తుండగా జీవన్ రెండు రోజుల క్రితమే హాస్టల్ లో వంట పనికి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News