- వనపర్తి డిసిసి చీఫ్ శివసేనారెడ్డి..
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని వనపర్తి డి సి సి చీఫ్ శివసేనారెడ్డి అన్నారు. బుధవారం వైయస్ఆర్17 వ వర్ధంతి సందర్భంగా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శివసేనరెడ్డి మాట్లాడుతూ .. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి విశేష కృషి చేసిన ప్రజా నాయకుడని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని..


ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు వైఎస్సార్ నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలవడమే వైఎస్సార్ రాజకీయ జీవితానికి ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, ప్రజా సంక్షేమ పాలన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందన్నారు.
వైఎస్సార్ చూపిన ప్రజాసేవా మార్గాన్ని కొనసాగిస్తూ పేదలు, రైతులు, సామాన్య ప్రజల సంక్షేమానికి కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. వైయస్సార్ అందించిన సంక్షేమాన్ని నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగూడెం సర్పంచ్ పుష్పలత శివకుమార్, మండల అధ్యక్షులు నక్క రవి కిరణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, గ్రామ అధ్యక్షుడు గుండ్రాల రాములు తదితరులు పాల్గొన్నారు.
