స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో ఎవరు అనేది నిన్నటిదాకా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ సస్పెన్స్ కు తెర దించుతూ మేకర్స్ ఆ యంగ్ హీరో ఎవరు ?, ఆయన సినిమా ఏంటి ? అనేది అనౌన్స్ చేశారు. స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన నటిస్తున్న కొత్త సినిమా “టార్టాయిస్” అంటూ మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
“టార్టాయిస్” సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. “టార్టాయిస్” సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తన్నారు.

“టార్టాయిస్” సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో ఒక డెడ్ బాడీ పక్కన హీరో రాజ్ తరుణ్ రక్తపు మరకలతో కూర్చుని ఉండటం, ఆయన పక్కనే ఒక కత్తి పడి ఉండటం ఆసక్తి రేపుతోంది. రాజ్ తరుణ్ తన కెరీర్ లో ఇప్పటిదాకా చేయని ఒక కొత్త తరహా ఇంటెన్స్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ తో తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు – రాజ్ తరుణ్, అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, షిజు ఏఆర్, రవి కాలె, మొయిన్, తదితరులు
టెక్నీషియన్స్
————————–
యాక్షన్ – బెమనొల శ్రీకాంత్
కొరియోగ్రఫీ – రాజ్ కృష్ణ, వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ – దేవర మధుకర్
ఎడిటర్ – గుళ్లపల్లి మాధవ్ కుమార్
డీవోపీ – శబరి విగ్నేష్
మ్యూజిక్ – అనూప్ రూబెన్స్
కో ప్రొడ్యూసర్స్ – మానస కుమార్, సంతోష్ ఇమ్మడి
ప్రొడ్యూసర్స్ – విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – రిత్విక్ కుమార్
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ (జి. ఎస్. మీడియా)
మార్కెటింగ్ : వంశీ కిృష్ణ (సినీ డిజిటల్)
