- ప్రతిభావంతులకు ఎక్స్లెన్స్ అవార్డ్స్-2026
- ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్లెన్స్ అవార్డ్స్-2026 కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. జర్నలిజం, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రతిభావంతులను ఈ సందర్భంగా సత్కరించి పురస్కారాలను అందజేశారు.కార్యక్రమానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని అన్నారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిం చిన వారికి అవార్డులు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆదాబ్ హైదరాబాద్ నిర్వాహకులు ఆదాబ్ సత్యం వీరమల్ల కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పురస్కారాలు జర్నలిస్టుల్లో మరింత బాధ్యతతో పనిచేయాలనే స్ఫూర్తిని కలిగిస్తాయని మంత్రి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ల డంలో, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమా లను ప్రజలకు చేరవేయడంలో పత్రికా రంగం ఎంతో ముఖ్యమైనదని తెలిపారు.
ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మీడియా బాధ్యత అని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పనితీరుపై నిర్మాణాత్మక విమర్శలు చేయడం, లోపాలను ఎత్తిచూపడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావడమే జర్నలిజం యొక్క అసలు బలమని అన్నారు.
అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం మాత్రమే కాకుండా ప్రజల పక్షాన నిలబడి వారి హక్కులు, సమస్యలు, ఆకాంక్షలకు వేదికగా నిలవడం కూడా మీడియా బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వం, ప్రజా ప్రతిని ధులు, అధికారులు మీడియాను భాగస్వామిగా భావిస్తూ పనిచేసిన ప్పుడే ప్రజాస్వామ్య పాలన మరింత పారదర్శకంగా, జవాబు దారీతనంతో ముందుకు సాగుతుందని అన్నారు.
15వ వార్షికోత్సవాన్ని పురస్కరించు కుని ఎక్స్లెన్స్ అవార్డ్స్-2026నిర్వహించడం ద్వారాజర్నలి జంరంగంలో విశేష సేవలు అందిస్తున్న వారిని గుర్తించి గౌరవించడం అభినందనీయ మని మంత్రి తెలిపారు. జర్నలిజం రంగంలో సేవలందిస్తున్న ప్రతి ఒక్క రికీ అభినందనలు తెలియజేస్తూ, ఆదాబ్ సత్యంకు మరోసారి హృదయ పూర్వక శుభాకాంక్షలుతెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు, అవార్డు గ్రహీతలు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
