Homeఆదాబ్ ప్రత్యేకంJHCHBS | జూబ్లీహిల్స్ సొసైటీలో ఆస్తి లేదు… అయినా పోటీ ఏంటి?

JHCHBS | జూబ్లీహిల్స్ సొసైటీలో ఆస్తి లేదు… అయినా పోటీ ఏంటి?

  • దీని వెనుక దాగివున్న కుట్ర!
  • రూ. 6,000 కోట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్..?
  • రంగంలోకి బడా నేతలు, మాజీ న్యాయాధికారి.. !
Jubilee Hills Society Election Controversy03

హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల వేళ దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆస్తి ఎప్పుడో అమ్ముకున్నా, కేవలం ఓటు హక్కు ఉందన్న ఒకే ఒక్క నెపంతో ఎన్నికల బరిలోకి దిగిన ఒక వ్యక్తి అసలు రంగు ఒకొక్కటిగా బయటపడుతోంది.

ఆస్తి లేదు… అయినా పోటీ ఏంటి? :

- Advertisement -

2013లోనే ఎస్.ఆర్.ఎల్.ఎం. కన్సల్టెన్సీ సర్వీసెస’ అనే కంపెనీ కి తన ఆస్తిని అమ్మేసిన శీనయ్య, ఓటు హక్కు పోతుందన్న భయంతో మెంబర్‌షిప్ బదిలీ చేయకుండా నాన్చుతూ వచ్చారు. తీరా ప్లేటు అమ్మేసిన ఈ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడనై, సదరు కంపెనీ యాజమాన్యం ఆగస్టు 25న సొసైటీని ఆశ్రయించింది. తమ పేరిట వెంటనే ఓనర్‌షిప్ బదిలీ చేయాలని కోరింది. ఎన్నికల కోడ్ ముగియగానే మెంబర్‌షిప్ బదిలీ అవ్వడం, శీనయ్య తన ఓటు హక్కు కోల్పోవడం ఖాయం.. ఆస్తి లేకపోయినా ఆయన ఎన్నికల్లో పోటీ పడుతున్నారంటే… సొసైటీ విలువైన ఆస్తులపై కన్నేసి కోట్లు కొల్లగొట్టేందుకేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.

రూ. 6,000 కోట్ల ప్రాజెక్టుపై కన్ను :

జూబ్లీహిల్స్ ఫేజ్- 4లోని అర్హులైన సభ్యులందరికీ ఇళ్లు కేటాయించేందుకు ప్రస్తుత పాలకమండలి సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించింది. అయితే, సుమారు రూ. 6,000 కోట్ల విలువైన ఈ భారీ ప్రాజెక్టును తన సొంత కన్‌స్ట్రక్షన్ కంపెనీకి కట్టబెట్టుకోవాలని శీనయ్య మాస్టర్ ప్లాన్ వేశారు.

ఈ కుట్ర వెనుక రాష్ట్ర ముఖ్య నేత బంధువు, ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే/మాజీ కేంద్రమంత్రి, ఒక మాజీ న్యాయమూర్తి అండదండలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.!

అభివృద్ధిని అడ్డుకునేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టుకు!

గత ఐదేళ్లుగా సొసైటీలో అక్రమాలను అరికట్టి, పాత పాలకుల అవినీతికి అడ్డుకట్ట వేస్తూ సొసైటీని ప్రగతిపథంలో నడిపిస్తున్న ప్రస్తుత ప్రెసిడెంట్ బొల్లినేని రవీంద్రనాథ్ పై శీనయ్య గ్యాంగ్ కుట్రలకు తెరలేపినట్లు సమాచారం.. ఎన్నికలను అడ్డుకోవడానికి మొదట హైకోర్టు సింగిల్ బెంచ్ ద్వారా స్టే తెచ్చారు. కానీ, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ స్టేను కొట్టివేయడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది.
చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా చుక్కెదురైంది. సుప్రీంకోర్టు స్పష్టంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 30న ఎన్నికలు ఖరారయ్యాయి. దీంతో దిక్కుతోచక ఇప్పుడు ఓటర్లను మభ్యపెట్టే చిల్లర రాజకీయాలకు తెరలేపినట్లు తెలుస్తోంది..

‘అబ్బమ’ కంపెనీ పేరుతో
వందల కోట్ల మోసాలు..?

నగర శివార్లలో ‘అబ్బమ’ కంపెనీ పేరిట శీనయ్య సాగిస్తున్న రియల్ ఎస్టేట్ దందాలు, మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. కిస్మత్‌పూర్‌లో 37 అంతస్తుల హైరైజ్ ప్రాజెక్ట్.. 40 అడుగుల రోడ్డు మాత్రమే ఉన్న చోట, 100 అడుగుల ప్రపోజ్డ్ రోడ్డు ఉందంటూ ప్రకటనలతో ప్రజలను అమాయకులను చేసి వందలాది ప్లాట్లు అమ్మి కోట్లు దండుకున్నారు.

నిబంధనల ఉల్లంఘన :

రేపు రోడ్డు విస్తరణ జరిగితే లేదా అగ్నిప్రమాదాలు జరిగి ఫైర్ ఇంజన్ తిరగాల్సి వస్తే నిబంధనలు (సెట్‌బ్యాక్స్) లేక తీవ్రంగా నష్టపోయేది ఆ ప్లాట్లు కొన్న అమాయక వినియోగదారులే! సొసైటీ అభివృద్ధి కోసం కష్టపడుతున్న బొల్లినేని రవీంద్రనాథ్ నేతృత్వంలోని పాలకమండలిని దించేందుకు, సొసైటీ సొత్తును దోచుకునేందుకు జరుగుతున్న ఈ కుట్రలపై ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చే ఇలాంటి వ్యక్తుల ప్రయత్నాలను తిప్పికొట్టి, సొసైటీని రక్షించుకోవాలని సొసైటీ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్లాట్ అమ్ముకున్న తరువాత సొసైటీ సభ్యత్వం ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే.. కానీ క్లబ్ మెంబర్షిప్ కోసం సదరు ప్లాట్ కొన్న సంస్థకి ట్రాన్స్ఫర్ చెయ్యకుండా శీనయ్య కాలయాపన చేస్తున్నాడు.. ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలు చూసి సదరు కొనుగోలుదారులు ఆశ్చర్యానికి గురి అయ్యారు.. కావున వెంటనే తమ హక్కుని కాపాడి మెంబర్షిప్ ని ట్రాన్స్ఫర్ చెయ్యాలని సొసైటీని కొనుగోలుదారులు కోరుతున్నారు..

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పరిధిలోని అత్యంత ఖరీదైన ఎం.ఎస్. నంబర్ 1250 – ప్లాట్ నంబర్ 422 (మొత్తం వైశాల్యం: 2,285 చదరపు గజాలు) సొసైటీ ఇచ్చిన ఎన్.ఓ.సి. ఆధారంగా, 29.05.2012న బి. సీనయ్య, బి. యమునా కలిసి డాక్యుమెంట్ నంబర్ 2082/2012 ద్వారా ఈ 2,285 చ.గజాల స్థలాన్ని ఎస్.ఆర్.ఎల్.ఎం. కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ’ కు విక్రయించారు.

సొసైటీలోని సభ్యులు ఎవరైనా తమకు సంబంధించిన ప్లాట్లను అమ్ముకున్నట్లైతే.. సొసైటీలో సభ్యులుగా కొనసాగడానికి వీలుకా దు అనే నిబంధన ఉండటం గమనార్హం.. అలాగే సొసైటీ ఎన్నిక ల్లో పోటీ చెయ్యడానికి అనర్హులు.. ఒకవేళ పోటీచేసి గెలిచినా ఆ ఎన్నిక చట్టప్రకారం, సొసైటీ బైలాస్ ప్రకారం చెల్లదు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News