Homeమహబూబ్‌నగర్‌Photography Day | కడ్తాల్‌లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

Photography Day | కడ్తాల్‌లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

  • కెమెరా సృష్టికర్త లూయిస్ డాగెర్‌కు ఘన నివాళి..మొక్కలు నాటిన ఫోటోగ్రాఫర్లు

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కడ్తాల్ మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫోటో అండ్ వీడియో అసోసియేషన్ జెండాను కడ్తాల్ మండల అధ్యక్షుడు చిప్ప కిరణ్ కుమార్ ఎగురవేశారు.అనంతరం కెమెరా సృష్టికర్త లూయిస్ డాగెర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని,కాలగమనంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను, చారిత్రక ఘట్టాలను భద్రపరిచే కళ అని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఫోటోగ్రాఫర్లు మొక్కలు నాటారు.ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఫోటోగ్రాఫర్లు శ్రీశైలం, భీష్మాచారి, రబ్బాని, నదీమ్,శివ,కృష్ణ,మహేష్, నవీన్, సాయి, మహేష్ తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News