- నాగచైతన్యను చూసేందుకు తరలివచ్చిన అభిమానులు.
ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగచైతన్య బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి వ్యక్తిగత పని నిమిత్తం రావడంతో పట్టణంలో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది . నాగచైతన్య తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపడంతో కార్యాలయ పరిసరాల్లో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ నాగచైతన్యకు అవసరమైన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం ఆయన ను వికారాబాద్ తాసిల్దార్ లక్ష్మీనారాయణ కారు వద్దకు వెళ్లి దగ్గరుండి సాగనంపారు.

- Advertisement -
