మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి కలిసి ప్రస్తుతం #Mega158 / #ChiruBobby2 చేస్తున్నారు. ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాబీ కొల్లి తన విజన్‌ను తెరపైకి తీసుకురావడానికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి పూర్తి సపోర్ట్‌తో, టీమ్ అంతా ఒకే స్పీడ్‌లో పనిచేస్తుండటంతో సినిమా షూటింగ్ ఇప్పటికే 40 రోజులు పూర్తి చేసుకుంది. ఇంత తక్కువ సమయంలో ఇంత కీలకమైన ప్రోగ్రెస్ సాధించడం సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కిస్తున్నారో స్పష్టం అవుతుంది.

సినిమా ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ అయింది. ఇప్పటివరకు తీసిన ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. కథలో ఇంటెన్సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, యాక్షన్ అన్నీ సరైన బ్యాలెన్స్‌లో ఉండేలా సినిమా రూపొందుతోంది. ఇటీవల షూట్ చేసిన ఇంటర్వెల్ ఫైట్ సినిమాకు మరో ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. భారీ స్థాయిలో డిజైన్ చేసి తెరకెక్కించిన ఈ యాక్షన్ బ్లాక్ ఫస్ట్ హాఫ్‌కు పవర్‌ఫుల్ హైలైట్‌గా ఉండబోతోంది. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌కు బాబీ కొల్లి మార్క్ మాస్ ఎలివేషన్స్ తోడవడంతో ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుందని తెలుస్తోంది.
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా భారీ అప్‌డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ స్పెషల్ అప్‌డేట్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ స్మూత్‌గా కొనసాగుతుండటంతో పాటు ఫస్ట్ హాఫ్ ఎడిట్ కూడా దాదాపు పూర్తవ్వడంతో ప్రొడక్షన్ నెక్స్ట్ ఫేజ్‌లోకి వెళ్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్. సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటింగ్. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్‌గా పనిచేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాత: వెంకట్ కె నారాయణ
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్
సంగీతం: థమన్ ఎస్
స్క్రీన్ ప్లే రైటర్స్: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
అడిషినల్ స్క్రీన్ ప్లే: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
DOP: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: ఆంటోనీ రూబెన్
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: యుగంధర్ టి
డైలాగ్స్: భాను-నందు
చీఫ్ కో-డైరెక్టర్లు: బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
