- మండిపడ్డ డీఎంకే ఎంపీ దయానిధి మారన్..
- డీ లిమిటేషన్ పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి..
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ప్రక్రియను సపోర్ట్ చేస్తుంటే, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఖండించారు. తెలంగాణలో అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ డీలిమిటేషన్ ప్రక్రియకు మద్దతు తెలుపుతున్నాడు. తమిళనాడులో ఎంపీలతో మీటింగ్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాలుగు రాష్ట్రాల్లో ఎందుకు మీటింగ్ నిర్వహించలేదని ప్రశ్నించారు. డీలిమిటేషన్ ప్రక్రియపై స్పష్టమైన ఆలోచన లేని కాంగ్రెస్ పార్టీకి, తమిళనాడులో డీలిమిటేషన్ ప్రక్రియపై నిరసన తెలిపే హక్కు లేదన్నారు..
- Advertisement -
