- అటవీ, పర్యాటక శాఖల సమన్వయంతో మరింత అభివృద్ధి…
- ప్రస్తుత రహదారిని తారు రోడ్డుగా మారుస్తాం…
- మావోయిస్టుల అంతంతో అభివృద్ధి దిశగా అడుగులు…
- తెలంగాణ డిజిపి సివి ఆనంద్…
తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల వైపు అభివృద్ధి పరుగులు పెట్టబోతోందని తెలంగాణ డిజిపి సివి ఆనంద్ తెలిపారు. సోమవారం మండలంలోని పామనూరు గుట్టలపై ఉన్న సిఆర్పిఎఫ్ బెటాలియన్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అనంతరం అక్కడనుండి చత్తీస్గడ్ సరిహద్దు వైపు జిల్లా డోలి గ్రామాల మీదుగా తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంత భూభాగానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి శాంతి కపోతాలను ఎగురవేశారు. గాలిలో ఎగిరే బెరులను సైతం అక్కడ వదిలిపెట్టారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో కర్రెగుట్టల ప్రాంతం అంతా పర్యాటక రంగ అభివృద్ధి వైపు అడుగులు వేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అటవీ పర్యాటక శాఖల సహకారంతో ఈ ప్రాంతంలో ఎత్తైన కొండలు అందమైన ప్రకృతి రమణీయతను ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం నేడు వారి ఆనవాళ్లు కనుమరుగవడంతో ఈ ప్రాంతంలో జనజీవనం సంచరించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కర్రగుట్టలో రహదారి నిర్మాణం కోసం పోలీస్ రెవెన్యూ అటవీ శాఖల సంయుక్త సహకారంతో విజయవంతంగా పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు.



మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారిలో భాగంగా మావోయిస్టుల ఉనికి పూర్తిస్థాయిలో కోల్పోయిందన్నారు. కేవలం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి అతడి భార్య మాత్రం ఇంకా పోలీసులకు లొంగలేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టు నేతలకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. లొంగిపోయిన వారికి ఇళ్ల స్థలాలతో పాటు వ్యవసాయ భూమి ఇతర వ్యాపారాల కోసం నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను పర్యాటక రంగం అభివృద్ధిలో భాగస్వాములు చేస్తామన్నారు.
అందమైన సెలయేళ్లు జలపాతాలు ఉన్న ఈ ప్రకృతి రమణీయ ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేలా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ, అటవీ శాఖ సమన్వయంతో ప్రాణాళికలు రూపొందించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 700 మంది మావోయిస్టులు ఇప్పటి వరకు లొంగిపోయారన్నారు. పలువురు కేంద్ర కమిటీ సభ్యులు చత్తీస్గడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించగా మరికొందరు లొంగిపోయారని డీజీపీ వివరించారు. మావోయిస్టుల హింసాత్మక సంఘటనకు ఒకప్పుడు డెన్ గా ఉన్న కర్రగుట్ట ప్రాంతం నేడు శాంతి మార్గంలో పయనిస్తోందన్నారు.



తుపాకుల మోతతో దద్దరిల్లిన ఈ ప్రాంతంలో ప్రశాంతత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ, చత్తీస్గడ్ సరిహద్దు భూభాగం లో ఆయన శాంతికపోతాలను ఎగరవేశారు. అనంతరం ఆ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఛత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 196వ సిఆర్పిఎఫ్ బెటాలియన్ తడపల ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అక్కడ చత్తీస్గడ్ రాష్ట్ర పోలీస్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై సరిహద్దు ప్రాంత అభివృద్ధిపై సమీక్ష జరిపారు. అనంతరం పామూరు గ్రామానికి చేరుకొని అక్కడ ఉన్న ఏడు కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారితోపాటు అటవీశాఖ అధికారులు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డీజీపీ పర్యటన సందర్భంగా బందోబస్తు వ్యవహారాలను వెంకటాపురం సిఐ ముత్యం రమేష్, ములుగు సిఐ నారాయణరావు లతోపాటు వెంకటాపురం, వాజేడు, పేరూరు ఎస్సైలు సమన్వయం చేశారు. డీజీపీ పర్యటన సందర్భంగా మురమురు కాలనీ గ్రామం నుండి చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతం వరకు భారీ ఎత్తున పోలీస్ బలగాలను మొహరించి పటిష్ట రక్షణ చర్యలను చేపట్టారు.
కర్రెగుటల్లో ఆనంద్ మార్క్…
డీజీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల అనంతరం కర్రెగుట్టల ను సందర్శించిన రాష్ట్ర డిజిపి సీవీ ఆనంద్ తన మార్క్ ను ప్రదర్శించారు. గతంలో ఈ ప్రాంతంలో మాజీ డిజిపి శివధర్ రెడ్డి కేవలం పామనూరు ప్రాంతం వరకు మాత్రమే పర్యటించగా… ప్రసాద్ డిజిపి మాత్రం రోడ్డు మార్గం ద్వారానే మురుమూరు కాలనీ నుండి బురదమయంగా ఉన్న రహదారులను పలు ప్రాంతాల్లో దిగబడుతున్న చిన్న చిన్న వాగుల గుండా సుమారు 30 కిలోమీటర్ల మేర రహదారిలోనే ప్రయాణించి ఛత్తీస్గడ్ సరిహద్దు భూభాగంలోకి చేరుకోవడం విశేషం. భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్న ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తన చత్తీస్గడ్ సరిహద్దుల్లోకి చేరుకొని అక్కడి అధికారులతో సమీక్షించడం కోసం మెరుపు…
