Homeమహబూబ్‌నగర్‌Notices | డిస్ట్రిక్ట్ క్లబ్ కు హైకోర్టు నోటీసులు

Notices | డిస్ట్రిక్ట్ క్లబ్ కు హైకోర్టు నోటీసులు

  • అధ్యక్ష, కార్యదర్శులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ తదుపరి విచారణ ఆగస్టు 19 నకు వాయిదా
  • అనుమతులు లేవంటూ హైకోర్టును ఆశ్రయించిన నేనుసైతం
  • న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంద
  • అక్రమ నిర్మాణం కూల్చివేసే వరకు పోరాడుతాం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ క్లబ్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భారీ భవనానికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంతో డిస్ట్రిక్ట్ క్లబ్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగిందని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నేనుసైతం స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మున్సిపల్, ఇతర సంబంధిత శాఖల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దాదాపు 12 కోట్ల రూపాయలతో జిల్లా క్లబ్ ప్రాంగణంలో నూతనంగా నాలుగు అంతస్తులతో ఓ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా ఎదురుగా జిల్లా కోర్టు, మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంతో పాటు పక్కనే జిల్లా పోలీసు కార్యాలయం లాంటి అత్యంత సున్నితమైన, కఠినమైన భద్రత, అనునిత్యం నిఘా, అధిక భద్రత గల రక్షణ ప్రాంతంలో ఇలాంటి భారీ భవనాన్ని నిర్మించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
High Court Issues Notices in Mahabubnagar District Club Construction Case2 1

హైకోర్టును ఆశ్రయించిన నేనుసైతం

అనుమతిలేని డిస్ట్రిక్ట్ క్లబ్ అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుని తాము ఆశ్రయించడం జరిగిందని సామాజిక కార్యకర్త ప్రవీణ్ పేర్కొన్నారు. అధ్యక్ష, కార్యదర్శులకుహైకోర్టు నోటీసులు ఈ నేపథ్యంలోనే జిల్లా క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించినట్లు ప్రవీణ్ తెలిపారు. అంతేకాకుండా కేసు తదుపరి విచారణ ఆగస్టు 19 నకు వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది విచారణలో భాగంగా జిల్లా క్లబ్ కు ఎలాంటి అనుమతులు లేవని ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వివరణ ఇవ్వగా, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించడంతోపాటు, జిల్లా క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని ప్రవీణ్ తెలిపారు. హైకోర్టుపై తమకు పూర్తి నమ్మకం ఉందని, తమ పోరాటానికి న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అక్రమ నిర్మాణం కూల్చివేసే వరకు పోరాడుతాం

అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న జిల్లా క్లబ్ నూతన భవనాన్ని ప్రభుత్వం కూల్చివేసే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తానని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News