- సత్యం, అహింసకు ప్రతీక మహాత్మా గాంధీ
- కడ్తాలలో ఘనంగా 157వ జయంతి వేడుకలు
కడ్తాల్: మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య నిర్మాణం కోసం ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్,తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గుప్తా,డీసీసీబీ డైరెక్టర్,ఆమనగల్–కడ్తాల్ సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు.శుక్రవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీజీ విగ్రహానికి ఉప్పల వెంకటేష్ గుప్తా, గంప వెంకటేష్ గుప్తా,కౌన్సిలర్ పాపిశెట్టి రాము తదితర నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం,అహింస,స్వచ్ఛత వంటి విలువలను సమాజానికి చాటిచెప్పిన మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

అహింసా మార్గంలో ప్రజలను ఏకం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహనీయుడని గుర్తు చేశారు. గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.గ్రామాల అభివృద్ధి,పరిశుభ్రత,సామాజిక సమానత్వం,ప్రజల భాగస్వామ్యంతో కూడిన గ్రామ స్వరాజ్య సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మొక్కలు నాటి.. రోగులకు పండ్ల పంపిణీ
గాంధీ జయంతి(Gandhi Jayanti) సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటారు.అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పాలు,పండ్లు పంపిణీ చేశారు.పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి గాంధీజీ సేవా స్ఫూర్తిని చాటారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిక్షపతి,ఉపసర్పంచ్ యాదగిరిరెడ్డి,మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్‌రెడ్డి,వార్డు సభ్యులు లక్ష్మమ్మ-మల్లయ్య,నూర్జహాన్ బేగం-జహంగీర్,కర్రోళ్ల కృష్ణవేణి-రమేష్,ఎర్రోళ్ల రాఘవేందర్, చేగురి మమతా-మహేష్,భానుకిరణ్,కొప్పు వసంత-కృష్ణ,దుడ్డు పుల్లమ్మ-నాగరాజు,మాదారం గణేష్ గౌడ్, మంకీ మహేష్,ముత్తికృష్ణ,విజయ్ రాథోడ్, వాంకుడోవత్ రవి నాయక్,తదితరులు పాల్గొన్నారు.
అలాగే బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కంబాలపల్లి పరమేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతుగంటి శంకర్,మాజీ ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ,సీనియర్ నాయకులు చందోజీ,గంప శ్రీనివాస్ గుప్తా,సింగిల్ విండో డైరెక్టర్ జోగు వీరయ్య,ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అర్థం వాసుదేవ్ గుప్తా,ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గుప్తా, వీరేంద్ర గుప్తా, రవికుమార్ గుప్తా,రమేష్ గుప్తా, లక్ష్మణ్, ప్రకాష్, గంప చంద్రయ్య, గంప వీరయ్య, చేగురి వెంకటేష్,బొగ్గారం వీరేశం,జూలూరి రమేష్, జి.సత్యనారాయణ, రాజశేఖర్, సాయికుమార్, వంశీకుమార్, జూలూరి శరత్, భరత్,సంద కిరణ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు అమృతం పాండు,గూడూరు నరేందర్‌రెడ్డి, గణేష్, హెచ్.ఆర్.మహేష్, చేగురి రాములు,బాచిరెడ్డి వెంకటరెడ్డి,బాచిరెడ్డి అశోక్‌రెడ్డి,కంబాలపల్లి అంజి,సిద్ధిగారి సురేష్,ఒగ్గు మహేష్,లాయక్ అలీ,యాదిరెడ్డి,సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
