- దరఖాస్తులు ఆహ్వానించిన ఉద్యాన యూనివర్సిటీ..
- చివరి తేదీ ఆగష్టు 16గా నిర్ణయం..
2026 – 27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఉద్యాన విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. దరఖాస్తుకు ఆగస్టు 16 చివరి తేదీగా నిర్ణయించింది. నాలుగు సంవత్సరాల కాలపరిమితితో ఉన్న ఈ కోర్సును విశ్వవిద్యాలయం పరిధిలోని నాలుగు అనుబంధ కళాశాలల్లో అందిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ఏ భగవాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం www.skltghu.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ పట్టభద్రులకు ప్రభుత్వ, ప్రైవేట్, పారిశ్రామిక రంగాల్లో విసృ్తతమైన అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ డీ రాజిరెడ్డి తెలిపారు..
- Advertisement -
